AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోస్ట్ పాపులర్ సీఎంల లిస్ట్: మూడో స్థానంలో వైఎస్ జగన్.!

దేశంలోని పాపులర్ సీఎంల లిస్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

మోస్ట్ పాపులర్ సీఎంల లిస్ట్: మూడో స్థానంలో వైఎస్ జగన్.!
Ravi Kiran
|

Updated on: Aug 08, 2020 | 3:31 PM

Share

Mood of the Nation poll: దేశంలోని పాపులర్ సీఎంల లిస్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జూలై 15 నుంచి జూలై 27 మధ్య ఈ సర్వేను నిర్వహించగా.. అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల లిస్టులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాధ్ అగ్రస్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండోస్థానంలో ఉన్నారు. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాలుగో స్థానంలో ఉండగా.. ఉద్దవ్ థాక్రే(మహారాష్ట్ర సీఎం) ఏడో స్థానంలో.. నవీన్ పట్నాయక్( ఒడిశా సీఎం) ఎనిమిదో స్థానంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే లీస్ట్ పాపులర్ సీఎంల లిస్ట్‌లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మొదటి స్థానంలో ఉండగా.. యడియూరప్ప(కర్ణాటక సీఎం), భూపేష్ బాగెల్(ఛత్తీస్‌గఢ్  సీఎం) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్‌ పట్ల చాలా మంది సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ఇక ఈ సర్వేను దాదాపు 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించగా. సుమారు 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా వారి అభిప్రాయాలను సేకరించారు.

Also Read: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు రీ-ఓపెన్.. కేంద్ర మార్గదర్శకాలు రెడీ.!

Follow Us
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!