Breaking News
  • మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో కామేష్ అలియాస్ హరి ప్రధాన నిందితుడు. జికె వీధి మం పెదపాడులో లంబయ్యను తుపాకీతో కాల్చి చంపిన హరి.
  • ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ అత్యాచారఘటనపై ముగ్గురు సభ్యుల సిట్ దర్యాప్తు బృందం ఏర్పాటు. 7 రోజుల లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.
  • తిరుపతి: తిరుపతిలోని టీటీడీ కి చెందిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం లోని బంగారు నగలు తాకట్టు కేసులో ప్రధాన అర్చకునికి 6 నెలలు జైలు. 2009లో స్వామివారి బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు. ఈ మేరకు 2009 ఆగస్టు 21న టిటిడి విజిలెన్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి వెస్ట్ పోలీసులు. ఆలయ ప్రధాన అర్చకుడు తో పాటు కుదువ వ్యాపారులు సాగరమల్లు, రాఘవరెడ్డి లపై ఐపీసీ 409, 420, 411 కింద కేసు నమోదు. 2015లో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు తో పాటు మరో ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష 5 వేలు జరిమానా విధించిన మూడో అదనపు మున్సిఫ్ కోర్టు. తీర్పుపై అప్పీలు కు వెళ్ళిన ఆలయ ప్రధాన అర్చకుడు. ఈ మేరకు మూడు అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో తీర్పు. కేసులో నిందితుడు గా ఉన్న వెంకట రమణ దీక్షితులుకు 6 నెలల జైలు తో పాటు 5 వేల రూపాయలు జరిమానా విదించి మిగతా ఇద్దరిపై కేసు కొట్టివేస్తూ తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి వై వీర్రాజు తీర్పు.
  • విశాఖ: మావోయిస్టులకు ఎదురుదెబ్బ... ఏసీఎం అరెస్ట్ .గాలికొండ ఏరియా కమిటీ మెంబర్ గెమ్మెలి కామేష్ అలియాస్ హరి అరెస్ట్ . గాలికొండ ఏరియాలో కీలకంగా ఉన్న హరి .హరిపై పలు ఎదురుకాల్పులు, హత్యలతోపాటు 50కి పైగా కేసులు .హరి తలపై 4 లక్షల రివార్డు.
  • చెన్నై : చెన్నై మహానగరం లో కిలోల్లో దొరికిన డ్రగ్స్ . చెన్నై రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న వాల్ టాక్స్ రోడ్ లో 25 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న డిఆర్ఐ అధికారులు తమిళనాడు , కేరళ , రాష్ట్రం లోఉన్న డ్రగ్స్ గ్యాంగ్ యూరోపియన్ దేశాలనుండి అక్రమంగా డ్రగ్స్ దిగుమతిని గుర్తించిన అధికారులు . అధికారులకు ఉన్న సమాచారం తో తనిఖీలు నిర్వహించగా 25 కిలోల ( పేశాడో ) డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు. చెన్నై నుండి ఎర్నాకులం కి పార్సెల్ ద్వారా సరఫరా చేస్తునట్టు గుర్తింపు. డ్రగ్స్ ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన డిఆర్ఐ అధికారులు.
  • అక్టోబర్ 4న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదన్న యూపీఎస్సీ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించిన యూపీఎస్సీ. ఈ ఏడాది వాయిదా వేస్తే వచ్చే ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై ఆ ప్రభావం పడుతుందన్న యూపీఎస్సీ. పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఆపైబడిన వారేనని అఫిడవిట్ లో పేర్కొన్న యూపీఎస్సీ. వారంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నామన్న యూపీఎస్సీ. కోవిడ్ సహా అన్ని ప్రోటోకాల్స్ పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన యూపీఎస్సీ. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.50.30 కోట్ల వ్యయం అయినట్లు తెలిపిన యూపీఎస్సీ. నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ ను విచారించనున్న సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 20 మంది యూపీఎస్సీ ఆశావహులు.

సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు రీ-ఓపెన్.. కేంద్ర మార్గదర్శకాలు రెడీ.!

స్కూళ్లు, విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది.

Reopening of schools, సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు రీ-ఓపెన్.. కేంద్ర మార్గదర్శకాలు రెడీ.!

Reopening of schools: మాయదారి కరోనా వైరస్ కారణంగా జనజీవనం అంతా స్థంబించిపోయింది. అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా కాలేజీలు, స్కూల్స్ మూతపడటంతో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది. నూతన విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై అందరి దృష్టి పడింది. ఈ నేపధ్యంలోనే స్కూళ్లు, విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది.

కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రణాళికలపై ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నత కార్యదర్శుల బృందం కీలక విషయాలను చర్చించారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆగస్టు 31 తర్వాత చివరిదశ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు వెల్లడించనుంది. అలాగే విద్యార్థులను క్లాసులకు పంపించాలా.? లేదా.? అనే అంశాలపై తుది నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసింది. ఈ క్రమంలోనే పాఠశాలలకు, విద్యాసంస్థలకు బ్రాడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్(ఎస్ఓపి) జారీ చేయనుంది.

జూలైలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలోనూ ఈ ఎస్ఓపీలనే ప్రస్తావించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అనుకూలంగా లేరని ఆ సర్వే సూచించినప్పటికీ, బలహీన వర్గాల విద్యార్థులు ఆర్థికంగా బాధపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇక కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు సీనియర్ తరగతుల విద్యార్ధులకు తిరిగి క్లాసులు ప్రారంభించాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది.

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించిన మార్గదర్శకాలు ప్రకారం.. పాఠశాలలను తెరిచి దశలవారీగా నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నాయి. మొదటి 15 రోజులు, 10, 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కానుండగా.. తరగతిలోని వివిధ సెక్షన్ల విద్యార్థులు పాఠశాలకు హాజరుకావడానికి నిర్దిష్ట రోజులు ప్రకటించనున్నారు. ఉదాహరణకు ఒక పాఠశాలలో 10వ తరగతికి నాలుగు సెక్షన్స్ ఉంటే.. ‘A’, ‘C’ సెక్షన్లలో సగం మంది విద్యార్థులు నిర్దిష్ట రోజులలో.. మిగిలిన విద్యార్థులు ఇతర రోజుల్లో వస్తారు. ఇక ఫిజికల్ అంటెండెన్స్ కోసం 5-6 నుండి 2-3 గంటల వరకు పరిమితం చేయనున్నారు. అన్ని పాఠశాలలు షిఫ్టుల పద్దతిలో నడుస్తాయి. ఒక షిఫ్ట్ ఉదయం 8 నుండి 11 వరకు ఉంటే..  మరొకటి మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఇక మధ్యలో ఒక గంట శానిటైజేషన్ కోసం ఉంటుంది. బోధనా సిబ్బంది, విద్యార్థులు కలిపి 33 శాతం సామర్ధ్యంతో పాఠశాలలను  నడపాలని సూచించారు.

ఇదిలా ఉంటే ప్రీ-ప్రైమరీ లేదా ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కూడా పాఠశాలలకు తిరిగి తీసుకురావాలని కార్యదర్శుల బృందం సూచిస్తోంది. ఆన్‌లైన్ తరగతులను కొనసాగించడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదని వెల్లడించింది. 10 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రవేశపెట్టిన తరువాత.. , 6 నుండి 9వ తరగతి వరకు కూడా నిర్దేశించిన షిఫ్టుల్లో పాఠశాలలు భౌతిక పాఠశాల విద్యను ప్రారంభించాలని సూచించారు. ”స్విట్జర్లాండ్ లాంటి దేశాలు పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు తిరిగి తీసుకొచ్చిన విధానంపై అధ్యయనం చేశామని.. సరిగ్గా అలాంటి మోడల్ భారతదేశంలో సక్సెస్ అవుతుందని సీనియర్ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అయితే కేంద్రం ఈ విధానాన్ని సిఫార్సు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని.. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నుంచి అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

Related Tags