ఏపీ మహిళా అభ్యర్థుల దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా!
TV9 Telugu
26 April 2024
కడప టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి దగ్గర 6.5 కేజీల బంగారం ఉంది. డైమండ్ ఆర్నమెట్స్‌తోపాటు, కొన్ని ఆభరణాలు ఉన్నాయి.
మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఉషశ్రీ దగ్గర 6.6 కేజీల బంగారం ఉంది.
విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దగ్గర మూడున్నర కిలోలు పసిడి ఉంది. 19 కోట్ల వరకూ కుటుంబ ఆస్తులు ఉన్నాయి.
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల దగ్గర మూడున్నర కోట్ల విలువగల బంగారం, 6 కేజీలకు పైగా బంగారు నగలు, 4 కోట్ల 61 లక్షల విలువ చేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయి.
ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక దగ్గర 2.3 కేజీల బంగారం ఉంది. రేణుక ఆస్తులు 161 కోట్లు.. అయితే బంగారం మాత్రం 2.3 కేజీలు.
టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తన దగ్గర సుమారు 2.5 కేజీల బంగారం ఉంది.
అరకు లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దగ్గర రెండుకిలోల పసిడి ఉన్నట్లు తెలుస్తోంది.
నరసాపురం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలబడిన ఉమాబాల దగ్గర రెండు కిలోల బంగారం ఉంది.