సీతారామం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార మృణాల్ ఠాకూర్. తొలిసినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
సీతారామం తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ చిన్నది, ఇప్పుడు హిందీలోనూ నటిస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. వ్యక్తిగత జీవితంతో పాటు, కెరీర్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
వివాహం గురించి మాట్లాడుతూ.. వృత్తిని అర్థం చేసుకునే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎంతో అవసరమని చెప్పుకొచ్చిందీ బ్యూటీ
ఇక సంతానం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫ్రీజింగ్ ఎగ్స్ విధానంపై కూడా స్పందించింది మృణాల్. తాను ఆ పద్ధతికి సుముఖంగా ఉన్నానని తెలిపింది.
భవిష్యత్తులో అవసరమైతే ఈ విధానం గురించి తాను కూడా ఆలోచిస్తున్నాని మృణాల్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ విధానాన్ని పలువురు సినీ తారలు ఫాలో అయిన విషయం తెలిసిందే.
ఎగ్ ఫ్రీజింగ్ విషయానికొస్తే.. అమ్మతనాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలు.. వయసులో ఉన్నప్పుడే తమ అండాలను శీతలీకరించుకుని.. ఆ తర్వాత నచ్చినప్పుడు పిల్లలు కంటారు.
తాజాగా ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మృణాల్ ప్రస్తుతం పూజా మెరీ జాన్ అనే బాలీవుడ్ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమవుతోంది.