AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీకి ఆగస్టు సంక్షోభం ! టీ కప్పులో తుఫానే అవుతుందా ? లేక …

అది 1995 ఆగస్టు 26. నాటి ఉమ్మడి ఏపీలో ఎన్ని రాజకీయ పరిణామాలు ? ఎన్ని ట్విస్టులు ? నాటి సీనియర్ ఎన్ఠీఆర్ ప్రభుత్వానికి ఎన్ని తలనొప్పులు ? వైస్రాయ్ హోటల్ వద్ద జరిగిన హైడ్రామా, చంద్రబాబు తనవైపు ఎమ్మెల్యేలను తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలు, లక్ష్మీ పార్వతి ఎంట్రీ, అసెంబ్లీ రద్దుకు ఎన్ఠీఆర్ యోచన, ఎమ్మెల్యేల తిరుగుబాటు..నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్… అన్నీ ఫ్లాష్ బ్యాక్ డెవలప్ మెంట్స్ ఓ రెండు భాగాల సినిమాలా సాగాయి. తాజాగా […]

టీడీపీకి ఆగస్టు సంక్షోభం ! టీ కప్పులో తుఫానే అవుతుందా ? లేక ...
Pardhasaradhi Peri
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 20, 2019 | 5:55 PM

Share

అది 1995 ఆగస్టు 26. నాటి ఉమ్మడి ఏపీలో ఎన్ని రాజకీయ పరిణామాలు ? ఎన్ని ట్విస్టులు ? నాటి సీనియర్ ఎన్ఠీఆర్ ప్రభుత్వానికి ఎన్ని తలనొప్పులు ? వైస్రాయ్ హోటల్ వద్ద జరిగిన హైడ్రామా, చంద్రబాబు తనవైపు ఎమ్మెల్యేలను తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలు, లక్ష్మీ పార్వతి ఎంట్రీ, అసెంబ్లీ రద్దుకు ఎన్ఠీఆర్ యోచన, ఎమ్మెల్యేల తిరుగుబాటు..నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్… అన్నీ ఫ్లాష్ బ్యాక్ డెవలప్ మెంట్స్ ఓ రెండు భాగాల సినిమాలా సాగాయి. తాజాగా తెలుగుదేశం పార్టీలో తలెత్తిన పరిణామాలు దాదాపు ఆగస్టు సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. కేశినేని నాని మనస్తాపం, తన ఫేస్ బుక్ లో ఆయన రాసుకున్న ‘ వైరాగ్య కథనం ‘ నుంచి మొదలైన వ్యవహారం మెల్లగా ఈ పార్టీకి గడ్డుకాలం సమీపించిందని సూచిస్తున్నాయనే అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ సిఎం చంద్రబాబు ఫారిన్ టూర్ లో ఉన్నప్పుడు ఒకదానివెంట ఒకటిగా జరిగిన ఈ అనూహ్య పరిణామాలు నిజంగా ఓ పెద్ద లాజిక్ కి కూడా అందనంతగా జరిగిపోయాయి.

పార్టీకి అత్యంత సీనియర్ నేతలైన సి.ఎం.రమేష్, సుజనా చౌదరి, గరికపాటి, టీజీ. వెంకటేష్ రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరుతూ సభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాయడం, బీజేపీ వైపు చూడడం, మరోవైపు కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన సుమారు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకోవడం కేవలం ఒక్కరోజులో జరిగిన రాజకీయ ‘ సునామీ ‘ ని తలపించాయి. అటు-వైసీపీ నేత సి. రామచంద్రయ్య ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని, ఇది ఆయన వ్యూహంలో భాగమేనని కొత్త పల్లవిని అందుకున్నారు. ఏమైనా..పార్టీకి ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదని, పార్టీ నేతలు, కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని ఫారిన్ నుంచే చంద్రబాబు తమ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం చూస్తే..ఇది మరో కొత్త ఎపిసోడ్ కి దారి తీస్తోందా అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏమైనా.. ఏపీలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి చెందినప్పటినుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం అలముకుంది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమే అయినా.. అఖండ విజయం సాధించిన వైసీపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయామే అన్న బాధ వీరిలో ఇప్పటికీ ఉంది.

కాగా-.. తాజా సమాచారం ప్రకారం.. తాము బీజేపీలో చేరుతున్నట్టు నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు స్పష్టం చేశారు. సభలో తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతూ సభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఇఛ్చిన లేఖపై వీరు సంతకాలు చేశారు. తమపై ఒత్తిడి ఉందని, వెళ్ళక తప్పడంలేదని వీరన్నారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నామని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇక రాయలసీమ అభివృద్ది కోసమే తాను కాషాయ కండువా కప్పుకోనున్నట్టు టీజీ.వెంకటేష్ ప్రకటించారు. మరోవైపు కేశినేని నాని కూడా కమలం పార్టీతో టచ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన కమలం గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లేటెస్ట్ మలుపులు ఏపీలో పార్టీని దెబ్బ తీస్తాయా అన్నది వేచి చూడాల్సిందే !