AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్‌షా కొత్త టాస్క్..? అదేనంటున్న కమలం

శతాబ్దాల పాటు వివాదంగా వుండి.. దాదాపు 70 ఏళ్ళు కోర్టుల్లో నానిన అయోధ్య ఆలయ వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో టాస్క్ మేనేజర్, బిజెపి చీఫ్, హోం మంత్రి అమిత్ షా నెక్స్ట్ టాస్క్ ఏంటి అన్న చర్చ తీవ్రమైంది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అమిత్ షా అంటే కేవలం ప్రధాని మోదీకి నమ్మిన బంటుగానే జనం చూశారు. కానీ.. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాతనే అసలు అమిత్‌షా అంటే […]

అమిత్‌షా కొత్త టాస్క్..? అదేనంటున్న కమలం
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 11, 2019 | 2:17 PM

Share

శతాబ్దాల పాటు వివాదంగా వుండి.. దాదాపు 70 ఏళ్ళు కోర్టుల్లో నానిన అయోధ్య ఆలయ వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో టాస్క్ మేనేజర్, బిజెపి చీఫ్, హోం మంత్రి అమిత్ షా నెక్స్ట్ టాస్క్ ఏంటి అన్న చర్చ తీవ్రమైంది. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అమిత్ షా అంటే కేవలం ప్రధాని మోదీకి నమ్మిన బంటుగానే జనం చూశారు. కానీ.. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాతనే అసలు అమిత్‌షా అంటే ఏంటో దేశంలోని సామాన్య ప్రజానీకానికి క్లియర్ కట్‌గా అర్థమవడం మొదలైంది.

ప్రధానంగా కశ్మీర్ సమస్య పరిష్కారానికి చిరకాలంగా అడ్డంకిగా నిలిచిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు కశ్మీర్‌ను రెండు భాగాలుగా చేస్తూ.. వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన చారిత్రక ఘట్టంలో దేశంలో ఎలాంటి దుస్సంఘటనలు జరగకుండా అమిత్‌షా తీసుకున్న చర్యలు.. 370 రద్దు, కశ్మీర్ విభజనపై రాజ్యసభలో అమిత్‌షా చేసిన ప్రసంగం దేశప్రజలకు అమిత్‌షా అంటే ఏంటో.. ఎంతటి పకడ్బందీ ప్లాన్‌తో అనుకున్న కార్యాచరణను పూర్తి చేయగలరో తెలిసి వచ్చింది. కశ్మీర్ లోయలో తీవ్ర నిర్బంధ పరిస్థితులున్నాయో.. లేవో.. కానీ.. కశ్మీర్ విభజన తంతును, ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని అత్యంత పక్కాగా పూర్తి చేసిన ఘనతలో సింహభాగం అమిత్‌షా దే.

అయోధ్య తీర్పుకు సుప్రీంకోర్టు ధర్మాసనం తనకు తానే డెడ్ లైన్ విధించుకున్న నేపథ్యంలో గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఎలాంటి దుస్సంఘటనలు జరగ కుండా చర్యలు చేపట్టడంలో అమిత్‌షా చూపిన తెగువ, అనుసరించిన వ్యూహంపై సర్వ్రతా అభినందనలు వెల్లువెత్తున్నాయి. అయోధ్ తీర్పు రాకముందే.. అన్ని రాష్ట్రాల డిజిపిలను అప్రమత్తం చేయడం, పలు చోట్ల శాంతి సంఘాలను ఏర్పాటు చేయడం వంటి ముందస్తు చర్యలు ఎంతో ఫలితాన్నిచ్చాయనే చెప్పాలి.

శనివారం అయోధ్య తీర్ప వెలువడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పలువురు ముస్లిం మత పెద్దలు… కూడా దేశంలో శాంతి, సామరస్యాలు చక్కగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు బిజెపితో అమీతుమీ అన్నట్లున్న బుఖారీ లాంటి ముస్లిం మత పెద్దలు సైతం సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తూ.. దేశం ఐకమత్యంగా వుండాలని ఆకాంక్షించడం విశేషం.

అటు అయోధ్యలో ఎలాంటి సంఘటనలు జరక్కుండా అమిత్‌షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి చెడు సంఘటనలు జరగలేదని చెప్పాలి. అయితే.. అయోధ్య టాస్క్‌లో కూడా అమిత్‌షా సక్సెస్సయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా తదుపరి లక్ష్యం ఏంటి అన్న చర్చ మొదలైంది.

బిజెపి తొలి నుంచి చెబుతున్న వాటిలో ఒకటి ఆర్టికల్ 370 రద్దు అయితే.. రెండోది అయోధ్య రామమందిరం. మూడోది అత్యంత వివాదాస్పదమైనది ఇంకోటి ఏంటంటే.. దేశవ్యాప్తంగా ఉమ్మడి సివిల్ కోడ్‌ను అమల్లోకి తేవడం. సో.. సంఘ్ పరివార్ ఇచ్చిన మూడోది, అత్యంత కీలకమైనది అయిన కామన్ సివిల్ కోడ్ టాస్కే అమిత్‌షాకు అత్యంత జఠిలమైనదిగా చెబుతున్నారు. అయోధ్య మీద వచ్చినంత సులువుగా ఏకాభిప్రాయం సాధ్యం కానిది కామల్ సివిల్ కోడ్. సో.. ఈ విషయంలో ఎన్డీయే సర్కార్ ఏ వ్యూహంతో ముందుకెళుతుంది ? ఈ టాస్క్‌లో అమిత్‌షా ఏ మేరకు విజయం సాధిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.