Goa Polls 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రచారాస్త్రం అదే.. తేల్చేసిన కేజ్రీవాల్

Goa Assembly Elections 2022: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

Goa Polls 2022: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రచారాస్త్రం అదే.. తేల్చేసిన కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:29 PM

Goa Assembly Elections 2022: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆప్.. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ మేరకు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదివారంనాడు ఉత్తరాఖండ్‌లో పర్యటించిన ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్.. అక్కడ తిరంగా సంకల్ప్ యాత్ర నిర్వహించారు. సోమవారం గోవా పర్యటనకు శ్రీకారం చుట్టారు.

గోవా యువకులకు ఉద్యోగాలు లభించడంలేదన్న కేజ్రీవాల్.. ఈ సమస్యపై స్థానికులతో మాట్లాడేందుకు అక్కడకు వస్తున్నానంటూ సోమవారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గోవాలో నిరుద్యోగుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరిందన్నారు. గోవాలో డబ్బు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతున్నాయంటూ అధికార బీజేపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగ సమస్య అజెండాతో గోవా అసెంబ్లీ ఎన్నికలను ఆప్ ఎదుర్కోబోతున్నట్లు కేజ్రీవాల్ పరోక్షంగా వెల్లడించారు.

అర్వింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్..

గోవాలో నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల మొదటివారంలో ఆప్ ప్రారంభించింది. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొద్దని ఆ పార్టీ పిలుపునిస్తోంది.

Also Read..

నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్తకు ఊరట.. బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్టు

Bank News: రూ.170 కోట్లు.. కస్టమర్ల నుంచి ముక్కు పిండి ఆ ఛార్జీలు వసూలు చేసిన పీఎన్‌బీ

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!