Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: చేవెళ్ల నుంచే ప్రజా ప్రస్థానం.. పాదయాత్ర వివరాలను వెల్లడించిన YS షర్మిల

తెలంగాణలో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. గతంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు కొనసాగింపుగా.. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల..

YS Sharmila: చేవెళ్ల నుంచే ప్రజా ప్రస్థానం.. పాదయాత్ర వివరాలను వెల్లడించిన YS షర్మిల
Ys Sharmila
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 20, 2021 | 8:08 PM

తెలంగాణలో పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. గతంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు కొనసాగింపుగా.. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల.. ఇప్పుడు.. తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తాజాగా తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ప్రతీవారం నిరుద్యోగ దీక్ష కొనసాగిస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఇక, వచ్చే నెల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇవాళ తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారు షర్మిల.

తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గతంలో చేవేళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించారు.. ఆయన పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో దోహదం చేసింది. ఇక వైఎస్‌ షర్మిల కూడా నాన్నకు కలిసివచ్చిన చేవెళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు.

అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న షర్మిల యాత్ర.. ఏడాది పాటు కొనసాగనుంది. తిరిగి మళ్లీ చేవేళ్లలోనే షర్మిల పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేశారు. మొత్తం 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణలో అన్ని పార్టీలు అమ్ముడు పోయాయని ఆరోపిస్తున్న షర్మిల.. TRSకు మేమే ప్రత్యామ్నాయం అంటున్నారు. YS ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన చేవెళ్ల నుంచే యాత్ర ప్రారంభిస్తున్నాం. పాదయాత్రలో బ్రేక్‌లు ఉండవని ప్రకటించిన YS షర్మిల.. ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగుతుంది. చేవెళ్లలో ప్రారంభమై.. చేవెళ్లలోనే ముగిస్తామని తెలిపారు.

రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. పాదయాత్రకు వైఎస్‌ఆర్‌ బ్రాండ్ అంబాసిడర్‌ అని.. ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..