AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Suspended: మహిళా అభ్యర్థి చీర లాగిన ఘటనలో.. ఆరుగురు పోలీసు అధికారులపై వేటు.. ఇద్దరు అరెస్ట్

UP Panchayat Elections: ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన మహిళపై ప్రత్యర్థులు దాడికి పాల్పడిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొంతమంది నామినేషన్‌ను

Police Suspended: మహిళా అభ్యర్థి చీర లాగిన ఘటనలో.. ఆరుగురు పోలీసు అధికారులపై వేటు.. ఇద్దరు అరెస్ట్
UP Panchayat Elections
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2021 | 2:26 PM

Share

UP Panchayat Elections: ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన మహిళపై ప్రత్యర్థులు దాడికి పాల్పడిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొంతమంది నామినేషన్‌ను అడ్డుకుంటూ మహిళపై దాడిచేసి ఆమె చీర లాగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారండంతో పలు పార్టీలు యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. లక్ష్మీపూర్ ఖేరి ప్రాంతంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమాజ్‌వాది పార్టీకి చెందిన మహిళపై కొంతమంది చీర లాగి దాడి చేశారు. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఎస్‌హెచ్‌ఓ, సర్కిల్ ఆఫీసర్ సహా ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు యూపీ లఖింపూర్ ఖేరి పోలీసులు వెల్లడించారు.

ఈ సంఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. సర్కిల్ ఆఫీసర్ (మొహమ్మీ) అభయ్ ప్రతాప్ మాల్, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అదర్ కుమార్ సింగ్, ఇన్‌స్పెక్టర్ హెచ్‌పి యాదవ్, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు బీజేపీ మద్దతుదారులు బ్రిజ్ కిషోర్, యష్ వర్మలను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద వీరిద్దరిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశామని.. తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు సూపరింటెండెంట్ విజయ్ ధుల్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూపీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. లఖింపూర్ ఖేరి జిల్లాలో మహిళపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించి చీర లాగిన సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ రేఖ శర్మ ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. కమిషన్.. డీజీపీకి లేఖ పంపిన తరువాత.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని.. ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు ఎన్‌సిడబ్ల్యూ వెల్లడించింది.

Also Read:

Revenge: మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ తర్వాత అడ్డంగా బుక్కైన యువతి..

TSRTC Bus Pass: గ్రేట్‌వాసులకు అలర్ట్.. బస్సు పాస్ సేవలు నిలిపివేసిన టీఎస్‌ఆర్‌టీసీ.. తిరిగి ఎప్పుడంటే..?