Huzurabad By Election: పోటీకి మేము రెడీ.. ఉండేది ఎవరో.. నిలిచేది ఎవరో.. హుజురాబాద్ టికెట్ కోసం 18మంది దరఖాస్తు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 05, 2021 | 8:33 PM

తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక కాకరేపుతోంది. తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పబోతుందన్న అంచనాలు..

Huzurabad By Election: పోటీకి మేము రెడీ.. ఉండేది ఎవరో.. నిలిచేది ఎవరో.. హుజురాబాద్ టికెట్ కోసం 18మంది దరఖాస్తు..
Huzurabad Congress Candidate Selection

రండి బాబూ రండి… ఆలసించినా ఆశాభంగం తప్పదంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనకు మాంచి రెస్పాన్సే వచ్చింది. హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా పద్దెనిమిది మంది అప్లికేషన్ పంపారు. ఇంతకీ, వాళ్లెవరో, ఆ కథేంటో ఒకసారి చదవండి.. తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ ఉపఎన్నిక కాకరేపుతోంది. తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పబోతుందన్న అంచనాలు ఉన్నాయి. హుజురాబాద్ కేంద్రంగానే అధికారానికి బాటలు వేసుకోవాలని కమలదళం భావిస్తోంది. అందుకే, రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలంతా హుజురాబాద్ పైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇక, అధికార టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ముందుకెళ్తోంది.

హుజురాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రూపాల్లో వరాల జుల్లు కురిపిస్తోంది. ఇక, మిగిలింది కాంగ్రెస్. అయితే, ఎప్పటిలాగే కాంగ్రెస్ లో డైలమా కంటిన్యూ అవుతోంది. బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలుసు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో కూడా తేలిపోయింది. కానీ, ఇప్పటివరకు తమ అభ్యర్ధిని ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్ మిగిలిపోయింది.

అసలు, హుజురాబాద్ బరిలోకి దిగడానికి ముఖ్యనేతలెవరూ ముందుకు రాలేదన్నది పార్టీ వర్గాల టాక్. ఒకరిద్దరు పేర్లు వినిపించినా మెయిన్ లీడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో, హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక కోసం ప్రకటన జారీ చేసింది టీపీసీసీ.

అప్లై చేసుకోవడానికి టైమ్ కూడా ఇచ్చింది. చివరికి ఆ గడువు ముగియడంతో హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మొత్తం 18మంది దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. మరి, ఈ 18మందిలో నుంచే ఒకరిని ఎంపిక చేస్తుందా? లేక కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌ వినిపించదు ఎందుకో తెలుసా..

Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu