డెరెక్ రాబ్సన్, అతని బృందం ప్రయోగశాలలో ఈ ఉల్క గురించి అధ్యయనం చేయడం ఆరంభించారు. ఈ ఉల్క 177 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత భూమికి వచ్చిందని.. దాని నిజమైన ఇల్లు అంగారక గ్రహం లేదా బృహస్పతి కావచ్చునని అంటున్నారు. కానీ నిపుణుల ఆసక్తి దాని ప్రయాణం కంటే దాని వయస్సు గురించి ఎక్కువగా ఉంది. ఈ ఉల్క మన సౌర వ్యవస్థ ఏర్పడటానికి ముందే ఉంటుందని శాస్త్రవేత్తల విశ్వాసం.