- Telugu News Photo Gallery World photos Know the weird hotel half in france half in switzerland about hotel arbez franco suisse in two countries
సగం ఫ్రాన్స్‌లో.. సగం స్విట్జర్లాండ్‌లో ఉన్న హోటల్… దాని గురించి షాకింగ్ విషయాలు మీకోసం..
ఈ ప్రపంచంలో అనేక అద్భుతాలు.. రహస్యాలు.. ఇప్పటికీ అంతుచిక్కని చిక్కుప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్నో అద్భుతాలున్నాయి.
Updated on: Nov 18, 2021 | 7:59 PM

అర్బెజ్ ఫ్రాంకో-సుయిస్సే హోటల్. ఇది సగం ప్రాన్స్‌లో.. సగం స్విట్జర్లాండ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే వింతైన హోటల్. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫ్రాన్స్‌ను ఆక్రమించినప్పుడు, ఆ సమయంలో ఫ్రెంచ్ సైనికులు అదే భాగానికి వెళ్లేందుకు అనుమతించారు. ఎందుకంటే హోటల్‌లో కొంత భాగం స్విట్జర్లాండ్‌లో కూడా ఉంది.

అర్బేజ్ హోటల్లో ఉంటే... మీరు రెండు దేశాల్లో ఒకేసారి నివసించిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ హోటల్లో బస చేసి.. నిద్రించినవారు.. ఒకే సమయంలో రెండు దేశాల్లో నిద్రించినవారవుతారు.

ఈ హోటల్ దాదాపు 125 ఏళ్ల నాటిది. ఇది ఫైవ్ స్టార్ హోటల్ కాదు.. కానీ 2-స్టార్ కేటగిరీ హోటల్. ఇక్కడ బస చేసేందుకు అనేక దేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులను ముందుగా ఏ దేశ సంస్కృతిని ఆస్వాదించాలనుకుంటున్నారు అని అడుగుతారు..అందుకు తగినట్టుగానే ఆ దేశ సౌకర్యాలను అందచేస్తారు.

ఈ హోటల్‌లోని కొన్ని గదులు నిద్రలో ఉన్నప్పుడు ఒక దేశం నుండి మరొక దేశానికి చేరుకునేలా ఉన్నాయి. ఆ గదులలోని పడకలు రెండు దేశాల సరిహద్దు రేఖకు మధ్యలో ఉంటాయి. సగం మంచం ఫ్రాన్స్‌లో.. సగం స్విట్జర్లాండ్‌లో ఉంటుందన్నమాట. ఒక జంట ఈ మంచంపై నిద్రిస్తే.. ఒకరు ఫ్రాన్స్, మరొకరు స్విట్జర్లాండ్ లో నిద్రించినట్లు.

ఈ హోటల్ సరిహద్దు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌తో ఉంది. దీంతో హోటల్ 2-2 చిరునామాలను కలిగి ఉంది. ఒక చిరునామా ఫ్రాన్స్ కాగా మరొకటి స్విట్జర్లాండ్. హోటల్ గదులు రెండు సమాన భాగాలుగా విభజించారు. ఇందులో సగం ఫ్రాన్స్‌లో, సగం స్విట్జర్లాండ్‌లో ఉండేలా ఈ గదులను అలంకరించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫ్రాన్స్‌ను ఆక్రమించినప్పుడు, ఆ సమయంలో ఫ్రెంచ్ సైనికులు అదే భాగానికి వెళ్ళడానికి అనుమతించారు. ఎందుకంటే హోటల్‌లో కొంత భాగం స్విట్జర్లాండ్‌లో కూడా ఉంది. అయితే ఈ హోటల్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చే ప్రజలు రెండు దేశాల సంస్కృతిని ఆస్వాదిస్తారు.




