- Telugu News Photo Gallery World photos Know the most highest application in world heavy price of one bottle of this nail paint
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే..
నెయిల్ పాలిష్.. అమ్మాయిల చేతి గొళ్లకు అందమైన రూపాన్ని అందిస్తుంది. దుస్తుల రంగులను బట్టి ఆయా రంగుల నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతుంటారు అమ్మాయిలు. అయితే వీటి ధర సాధారణంగా తక్కువగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఉంది.
Updated on: Feb 15, 2022 | 12:47 PM

అమ్మాయిల మేకప్ ఉత్పత్తులలో నెయిల్ పాలిష్ది ప్రత్యేకం. అమ్మాయిల గోళ్లకు అందమైన రూపాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు ఖరీదైన లిప్‌స్టిక్‌లు తరచు ప్రస్తావనకు వస్తుంటాయి. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి విన్నారా ? ఎందుకు అంత ధర ఉందో తెలుసుకుందామా.

వాస్తవానికి లాస్ ఏంజిల్స్ డిజైనర్ అజాచర్ పోగోసియన్ ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ రూపొందించారు. ఇది నలుపు రంగులో ఉంటుంది. అలాగే గోళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.

దీని ధర దాదాపు 250,000 డాలర్లు. అంటే మన భారతీయ మార్కెట్లో దీని ధర 1 కోటి 90 లక్షలు. దాదాపు రూ. 2 కోట్లు విలువైన ఈ నెయిల్ పాలిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదు.

ఇది ఎంత ఖరీదైనదిగా ఉంటుందో తెలుసుకుందామా.. ఓ లగ్జరీ జ్యువెల్లరీ డిజైనర్ దీనిని డిజైన్ చేసి అందులో 267 క్యారెట్ల నల్లటి వజ్రాలను చేర్చారు. నల్లటి వజ్రాల వాడకం వలన ఇంత విలువ ఉంటుంది.

ఆజాచర్ కాకుండా.. మార్కెట్లో చాలా ఖరీదైన నెయిల్ పాలిష్ లు ఉన్నాయి. వీటిని ప్లాటినం పౌడర్‌తో తయారు చేస్తారు. ఇది కాకుండా.. అనేక రకాల నెయిల్ పాలిష్ లు వాటిని ఏర్పర్చిన బాటిల్ కారణంగా కూడా ప్రత్యేకంగా నిలిచాయి.




