- Telugu News Photo Gallery World photos Know some interesting facts about world most dangerous bridges
అక్కడకు వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమే.. ధైర్యంతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిందే.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి.. మీరు తెలుసుకొండి..
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే ఎంతో ధైర్యం కావాల్సి ఉంటుంది. నిజమే మరీ చిట్టడవిలోకి వెళ్లిన.. అల్లంత దూరంలో ఉన్న ఆకాశంలోకి ఎగిరిన కొండంత ధైర్యం ఉండాలి. అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే.. ధైర్యమే కాదు.. అదృష్టం కూడా ఉండాలి. ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెనల గురించి తెలుసా.
Updated on: Aug 09, 2021 | 9:42 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన పెరు దేశంలో ఉంది. కుజ్యో గ్రామాన్ని పెరూతో కలిపే వంతనను కేవలం తాడు సహాయంతో మాత్రమే నిర్మించారు. అయితే దీనిని ప్రతి ఏడాది నిర్మిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన. అలాగే 2013 సంవత్సరంలో ఈ వంతెన యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.

రెండవ ప్రమాదకరమైన వంతెన చైనాలో ఉంది. దీనిని పూర్తిగా గాజుతో నిర్మించారు.. ఈ వంతెనపై నడుస్తున్న సమయంలో కింద ఉన్న ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంటుంది. 1230 అడుగుల ఎత్తు, 984 అడుగుల పొడవు ఉన్న ఈ వంతెన అత్యంత ప్రమాదకరమైనది.

కారిక్ ఎ రెడ్ బ్రిడ్జ్.. ఇది రెండు పర్వతాలను కలుపుతుంది. ఈ వంతెనపై నడుస్తున్న సమయంలో గాలిలో ఊగుతున్నట్టుగా భావన కలుగుతుంది. కింది భాగంలో నీరు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భూమికి 100 అడుగుల ఎత్తులో నిర్మించారు.

తిట్లిస్ క్లిఫ్ వాక్.. ఈ వంతెన స్విట్జర్లాండ్లో ఉంది. ఇది రెండు అందమైన మంచు కొండలను కలుపుతుంది. పూర్తిగా మంచుతో కప్పపడిన ఈ వంతెనను దాటడం అంటే ఎంతో ధైర్యంతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిందే.

కాపిలానో సస్పెన్షన్ వంతెన. దీనిని 1889లో కెనడాలో నిర్మించారు. ఈ వంతెన ఎత్తు 230 అడుగులు.. పొడవు 460 అడుగులు. అడవులను కలుపుతూ రెండు కొండల నడుమ దీనిని నిర్మించారు. ఈ వంతెనను దాటటం పెద్ద సాహసమే.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెనలు..




