- Telugu News Photo Gallery World photos Do you know some of unique schools to where teachers using amazing methods for studies
ప్రపంచంలోనే అత్యంత వింతైన పాఠశాలలు ఇవే.. అక్కడ పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
స్కూల్స్.. సాధారణంగా.. కొన్ని గదులు.. చక్కటి మైదానంతో చూడాటానికి ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే పిల్లలు సైతం ప్రపంచాన్ని మరిచిపోయి.. స్నేహితులతో గడిపేస్తుంటారు. అయితే ప్రపంచంలోనే వింతైన పాఠశాలలు కొన్ని ప్రదేశాలలో ఉన్నాయి. అక్కడ పాఠాలు కూడా ప్రత్యేకంగా బోధిస్తారు.
Updated on: Jun 01, 2021 | 9:53 PM

డాంగ్ డాంగ్.. క్యూస్కూల్.. చైనాలోని ఈ పాఠశాల సుమారు 186 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. ఈ పాఠశాల సహజ గుహలో ఉంది. ఇందులో 1984 నుంచి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. 2011 లో చైనా ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది.

కార్పే డైమ్ స్కూల్: ఈ పాఠశాల ఒహియోలో ఉంది. ఇది ఆఫీస్ లాగే ఉంటుంది. తరగతి గదులకు బదులుగా సుమారు 300 క్యూబికల్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఎలాంటి సమస్యను ఎదుర్కోన్న ఉపాధ్యాయుడు వచ్చి వెంటనే వారికి సహాయం చేస్తాడు.

ప్రపంచంలోని విచిత్రమైన పాఠశాలలు (6) కంప్రెస్డ్

స్కూల్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ: ఈ పాఠశాల సాంప్రదాయ విద్యా విధానాలకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడి పిల్లల విద్య కోసం ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ పిల్లలకు ఐప్యాడ్‌లు, 3 డి మోడలింగ్ , సంగీతం సహాయంతో బోధిస్తారు.

సడ్‌బరీ స్కూల్: ఈ పాఠశాల అమెరికాలో ఉంది. ఇందులో పిల్లలు తమ సొంత సమయ పట్టిక (టైం టేబుల్)ను తయారు చేసుకుంటారు. అలాగే వారు ఏ రోజు చదువుకోవాలో కూడా వారే నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఏ విధమైన అధ్యయన పద్ధతులను అవలంబించాలి.. తమను తాము ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాన్ని కూడా పిల్లలే నిర్ణయిస్తారు.

ప్రపంచంలోనే వింతైన స్కూల్స్..




