ఈ ప్రపంచం రకరకాల రహస్యాలతో నిండి ఉంది. ఇన్నేళ్ల పరిశోధనల తరువాత, శాస్త్రవేత్తలు కొన్ని రహస్యాలను ఛేదించారు. అయితే మరికొన్ని మానవ మేధస్సుకు సవాల్ విసురుతూ.. ఇప్పటికీ రహస్యంగా ఉన్నాయి. వీటిని శాస్త్రవేత్తలు కూడా పరిష్కరించలేకపోయారు. విశ్వంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతున్నప్పటికీ, సైన్స్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మానవులకు వీటి గురించి తెలుసుకోవడం అసాధ్యంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, విశ్వం అనంతం..మొత్తం విశ్వాన్ని తెలుసుకోవడం మానవులకు అంత సులభం కాదు. అయితే, భూమిపై కూడా కొన్ని రహస్యమైన ప్రదేశాలున్నాయి. వీటి రహస్య తెరను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు తొలగించలేకపోయారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని వింత సంఘటనలు (విచిత్రమైన సంఘటనలు), రహస్య ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మీరు కూడా ఆశ్చర్యపోతారు.