- Telugu News Photo Gallery Winter Heart Attacks: These 6 Morning Symptoms Of Cardiac Concern You Should not ignore In Winter
Winter Heart Attacks: ఉదయాన్నే ఈ 6 లక్షణాలు కన్పిస్తే అస్సలు ఆలస్యం చేయకండి.. ప్రమాదం అంచున ఉన్నట్లే
రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, తుమ్ములు, దగ్గు సమస్య చలికాలంలో వేధిస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఆస్తమా, రుమాటిజం నొప్పి కూడా పెరుగుతుంది. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయాన్నే ఈ 6 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..
Updated on: Dec 13, 2023 | 7:08 PM

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, తుమ్ములు, దగ్గు సమస్య చలికాలంలో వేధిస్తుంది. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఆస్తమా, రుమాటిజం నొప్పి కూడా పెరుగుతుంది. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయాన్నే ఈ 6 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉదయం ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, అసాధారణ నొప్పి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. తేలికపాటి ఒత్తిడి ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కార్డియాక్ అరెస్ట్ సంకేతాలు కావచ్చు. శీతాకాలంలో ఆస్తమా రోగులు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ప్రతిరోజూ ఉదయం వేళల్లో మీకు ఉబ్బసం లేకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

రాత్రి 6-7 గంటల పాటు నిద్రపోయిన తర్వాత ఉదయం లేవలేకపోతే, శరీరం బలహీనంగా అనిపిస్తే, అది కూడా గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. విపరీతమైన అలసట కూడా గుండె జబ్బులకు కారణం కావచ్చు.

ప్రతిరోజూ ఉదయం చెమట పట్టినట్లు అనిపించడం, గుండెపై ఒత్తిడిగా ఉన్నట్లు అనిపిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదయం నిద్ర లేవగానే కళ్లు తిరగడం, వాంతులు అవ్వడం.. వంటి మార్నింగ్ సిక్‌నెస్ లక్షణాలు చలికాలంలో ఉదయాన్నే మెదడులో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదు.

మెడలో నొప్పి, ముఖ్యంగా ఎడమవైపు నొప్పి ఉంటే అది గుండెపోటుకు సంకేతం. శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోయినప్పుడు, ఈ రకమైన నొప్పి తీవ్రమవుతుంది. అలాగే, శీతాకాలంలో గుండె చప్పుడు సక్రమంగా లేకున్నా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.





























