మరో ఐకానిక్ పాత్రలో కనిపించనున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి..
సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ అందాల భామ. చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది ఈ వయ్యారి భామ. పేరుకే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కానీ తెలుగు అమ్మాయిలా అలరిస్తుంది సాయి పల్లవి.
Updated on: Dec 22, 2025 | 10:04 PM

సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ అందాల భామ. చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది ఈ వయ్యారి భామ. పేరుకే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కానీ తెలుగు అమ్మాయిలా అలరిస్తుంది సాయి పల్లవి.

ఫిదా సినిమా నుంచి ఇప్పటివరకు అద్భుతమైన పాత్రలు చేస్తూ అలరిస్తుంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తుంది ఈ అమ్మడు.

నేచురల్ బ్యూటీగా ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే .. ఆమెకోసమే సినిమాలు చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇక సాయి పల్లవి పాత్ర కోసం చాలా కష్టపడుతుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేస్తుదని ఈ అమ్మడు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో నటిస్తుంది ఈ భామ. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో ఐకానిక్ రోల్ చేయనుందని తెలుస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మీ పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా సాయి పల్లవి నటిస్తుందా.? లేదా.? అన్నదాని పై త్వరలోనే క్లారిటీ రానుంది.