- Telugu News Photo Gallery Why should sons perform rituals for parents? check here is details in Telugu
Interesting Facts: తల్లిదండ్రులకు కర్మకాండలు.. కొడుకులే ఎందుకు చేయాలి?
తల్లిదండ్రులకు అంత్యక్రియలు, కర్మకాండలు కొడుకులే చేయాలి అనుకుంటారు. కనీసం తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేసేందుకైనా కొడుకు పుట్టాలి అని అంటారు. పున్నాగ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు మాత్రమేనని నమ్ముతారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు కొడుకులు లేని వారికి కూతుళ్లే కర్మకాండలు జరిపిస్తున్నారు. కానీ అసలు కొడుకులు మాత్రమే తల్లిదండ్రులకు కర్మకాండలు ఎందుకు చేయాలి? దహన సంస్కారాలు కూతుళ్లు ఎందుకు చేయకూడదో..
Updated on: May 20, 2024 | 6:43 PM

తల్లిదండ్రులకు అంత్యక్రియలు, కర్మకాండలు కొడుకులే చేయాలి అనుకుంటారు. కనీసం తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేసేందుకైనా కొడుకు పుట్టాలి అని అంటారు. పున్నాగ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు మాత్రమేనని నమ్ముతారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.

ఇప్పుడు కొడుకులు లేని వారికి కూతుళ్లే కర్మకాండలు జరిపిస్తున్నారు. కానీ అసలు కొడుకులు మాత్రమే తల్లిదండ్రులకు కర్మకాండలు ఎందుకు చేయాలి? దహన సంస్కారాలు కూతుళ్లు ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణ కాలం నుంచి తల్లిదండ్రులు చనిపోతే.. కొడుకే కర్మ కాండలు చేయాలని ఉంది. కొడుకుని పుత్రా అని కూడా పిలుస్తారు. పుత్రా అంటే.. నరకం నుండి రక్షించేవాడు అని అర్థం. అందుకే కొడుకుకు మొదటి హక్కు ఇచ్చారు. అదే విధంగా కొడుకును విష్ణుమూర్తిగా భావిస్తారు.

విష్ణువు అంటే పోషించేవాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరినీ చూసుకునే వాడు. అప్పట్లో ఆడపిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. ఈ మధ్య కాలంలో ఆడ పిల్లలు కూడా కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నారు.

మెయిన్‌గా కొడుకు తలకొరివి పెడితే.. నరకం నుంచి విముక్తి పొంది.. స్వర్గానికి వెళ్తారని ఓ విశ్వాసం దాగి ఉంది. అందుకే కొడుకులనే కర్మకాండలు చేయమంటారు. ఇప్పటికీ ఈ ఆచారం చాలా గ్రామాల్లో ఉంది. కేవలం అక్కడక్కడ మాత్రమే కూతుళ్లు చేస్తున్నారు.




