- Telugu News Photo Gallery Wherever gold is placed in the house, it will come together well, Check Here is Details
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఎక్కడ పెడితే బాగా కలిసి వస్తుంది..
బంగారానికి మగువలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం అంటే లేడీస్‌కి చాలా ఇష్టం. ఇంట్లో ఎంత బంగారం ఉన్నా.. మహిళలు ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు. బంగారం కొని ఇంట్లో పెడితే సరిపోదు. ఆ బంగారం పెట్టే ప్లేస్ కూడా అనుకూలంగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బంగారం పెట్టే ప్లేస్ కూడా సరైన దిశలో ఉంటే.. బంగారంతో లాభాలు పొందవచ్చని అంటున్నారు. బంగారాన్ని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉండం వల్ల..
Updated on: Aug 08, 2024 | 3:05 PM

బంగారానికి మగువలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం అంటే లేడీస్‌కి చాలా ఇష్టం. ఇంట్లో ఎంత బంగారం ఉన్నా.. మహిళలు ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు. బంగారం కొని ఇంట్లో పెడితే సరిపోదు. ఆ బంగారం పెట్టే ప్లేస్ కూడా అనుకూలంగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బంగారం పెట్టే ప్లేస్ కూడా సరైన దిశలో ఉంటే.. బంగారంతో లాభాలు పొందవచ్చని అంటున్నారు. బంగారాన్ని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉండం వల్ల.. సంపద, సౌభాగ్యాలు పెరుగుతాయట. మరి వాస్తు శాస్త్రం ప్రకారం బంగారం ఎక్కడ పెట్టాలో.. ఏ దిశలో పెడితే ఇంటికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి దిశలో బంగారు ఆభరణాలను ఉంచాలి. ఈ దిశలో బంగారం, బంగారు ఆభరణాలు ఉంచితే చాలా మంచిది. బంగారం కొనడం కూడా పెరుగుతుంది.

అయితే బంగారం కానీ బంగారు ఆభరణాలు కానీ వాయువ్య మూలలో మాత్రం అస్సలు ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అదే విధంగా బంగారు ఉంచే గది పసుపు రంగులో ఉంటే మరింత మంచిదట.

అయితే ఒక వేళ మీరు బంగారాన్ని అల్మరాలో ఉంచాలి అనుకుంటే ఉత్తర దిశలో ఉంచవచ్చు. ఎందుకంటే డబ్బు, బంగారాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వల్ల బాగా అనుకూలిస్తుంది. ఇంట్లో సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది.




