- Telugu News Photo Gallery What happens if you wear dead people's clothes? check here is details in Telugu
Spiritual: చనిపోయిన వ్యక్తుల దుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుంది?
ఎప్పుడు పుడతామో.. ఎలా చనిపోతామో అన్న విషయం ఎవరికీ తెలీదు. చిన్న వయసులో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందులోనూ బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతే మరింత బాధగా ఉంటుంది. అయితే.. చనిపోయిన వ్యక్తుల గుర్తుగా చాలా మంది బట్టలను ధరిస్తూ ఉంటారు. అలా చనిపోయిన వ్యక్తుల దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుంది? గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల దుస్తులను.. పొరపాటున కూడా వేరే వాళ్లు ధరించకూడదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా వాళ్ల వస్తువులపై..
Updated on: May 17, 2024 | 7:56 PM

ఎప్పుడు పుడతామో.. ఎలా చనిపోతామో అన్న విషయం ఎవరికీ తెలీదు. చిన్న వయసులో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అందులోనూ బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతే మరింత బాధగా ఉంటుంది. అయితే.. చనిపోయిన వ్యక్తుల గుర్తుగా చాలా మంది బట్టలను ధరిస్తూ ఉంటారు. అలా చనిపోయిన వ్యక్తుల దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుంది?

గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల దుస్తులను.. పొరపాటున కూడా వేరే వాళ్లు ధరించకూడదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా వాళ్ల వస్తువులపై ఆత్మ అనేది ముడి పడి ఉంటుంది. దీంతో మీ పై ఆత్మ ఆకర్షణ పెరుగుతుంది.

నిజానికి మృతుడి ఆత్మ తన కుటుంబాన్ని విడిచి వెళ్లడానికి అస్సలు ఇష్టపడదు. వారి చుట్టూనే తిరుగుతుందని గరుడ పురాణం చెబుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి వస్తువులను మన దగ్గర ఉంచుకోవడం ద్వారా ఆత్మ మనతో ముడి పడి ఉంటుంది.

అంతే కాకుండా చనిపోయిన వ్యక్తి ఆత్మ.. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తిరుగుతూ వేధిస్తుంది. అందుకే మరణించిన వ్యక్తి వస్తువులను దానం చేయాలని గరుడ పురాణం అంటోంది. దీని వల్ల తీసుకున్నవారికి కూడా ఎలాంటి నష్టం ఉండదు.

మరణించిన వ్యక్తి ఆత్మ.. సులభంగా ఇంటిని విడిచి పెట్టి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ సమయంలో మరణించిన వ్యక్తులు దుస్తులు ధరిస్తే.. సమస్యలు రావడం మొదలవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం.




