AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టపర్తిలో విజయ్, రష్మిక ప్రత్యేక పూజలు.. వైరల్ అవుతున్న ఫొటోస్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విరోష్ జంట గురించే చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పుట్టపర్తిలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

Rajeev Rayala
|

Updated on: Oct 15, 2026 | 4:31 PM

Share
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విరోష్ జంట గురించే చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పుట్టపర్తిలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. తమ అభిమాన తారల ఆధ్యాత్మిక పర్యటన గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

1 / 5
శ్రీ సత్యసాయి బాబా కొలువైన పుట్టపర్తి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశవిదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి సత్యసాయి బాబాను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పుట్టపర్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

2 / 5
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరి పేర్లను కలిపి అభిమానులు ‘విరోష్’ అని పిలుచుకుంటారు. వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. పుట్టపర్తి పర్యటనకు సంబంధించిన వార్త కూడా ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

3 / 5
టాలీవుడ్‌లో విరోష్ జంటగా అభిమానుల మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి తెరపై కనిపించనున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.

4 / 5
సాధారణ ప్రేమకథలు, కమర్షియల్ అంశాలకు భిన్నంగా ‘రణబాలి’లో చరిత్రలోని ఓ విషాదకరమైన అధ్యాయాన్ని చూపించబోతున్నారు. బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొన్న కరువు, ఆకలి చావులు, ప్రజల దయనీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కథను రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. కరువు కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన చీకటి రోజులను ఈ సినిమాలో చూపించనున్నారు. 

5 / 5
Follow Us
కేవలం రూ.200కే 30GB డేటా, 20కిపైగా OTTలు, యూట్యూబ్‌ ప్రీమియం..!

కార్తీక పౌర్ణమి ఎప్పుడు? దాని గురించి తెలుసుకుందాం!

ముఖానికి ఆవిరి పడుతున్నారా? అసలు నిజాలేంటో డర్మటాలజిస్ట్ మాటల్లో

బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం..
బాలీవుడ్‌లో ఎంతో మంది నటులకు అన్యాయం..
ఏపీలో భారీ పేలుడు.. నలుగురు మృతి.. అసలేం జరిగింది?

ఏకాంతంగా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ భర్తను తీసుకెళ్లి..

అర్థరాత్రి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే..

కలలో చంద్రుడు కనిపిస్తే శుభమా? పౌర్ణమి, అర్ధచంద్రుడు కనిపిస్తే..

మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి..!

ఈ బెర్రీ పండ్ల‌ను అంత త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కండి.. వీటితో క‌లిగే