Bank Account: అర్థరాత్రి మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఉదయం వరకు ఆగకండి.. వెంటనే ఇలా చేస్తే..
అర్థరాత్రి ఏదైనా బ్యాంక్ మోసం జరిగితే మీరు ఉదయం వరకు వేచి చూడక్కర్లేదు. మీరు ఉదయం వరకు వేచి చూడగానే వెంటనే బ్యాంక్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. దీని వల్ల నష్టాన్ని మీరు తగ్గించుకోవచ్చు. మీరు ఎలా ఫిర్యాదు చేయాలనేది ఇక్కడ చూద్దాం.

అర్థరాత్రి ఏదైనా సైబర్ మోసం లేదా మీకు తెలియకుండా ఇతర కారణాల మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? అయితే మీరు ఉదయం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఉదయం ఫిర్యాదు చేయవచ్చులే అని సైలెంట్‌గా ఉంటే మీరు మరింత మోసపోవచ్చు. దీంతో ఉదయం వరకు వేచి చూడకుండా వెంటనే ఫిర్యాదు చేయడం మంచిది. దీని వల్ల మీ నిధులను కాపాడుకోవడంతో పాటు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అనధికారిక లావాదేవీలు, మోసాలపై ఫిర్యాదు చేయడానికి బ్యాంకులు 24 గంటల పనిచేసే మార్గాలను కల్పించాలి. దీంతో కస్టమర్లు అర్థరాత్రి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్లు, వెబ్ సైట్లు, యాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలి.
బ్యాంక్ సిబ్బందికి ఫిర్యాదు చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్‌ను భద్రపర్చుకోండి. మీ డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, యూపీఐ చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేసేలా బ్యాంక్ సిబ్బందిని రిక్వెస్ట్ చేయండి. దీంతో బ్యాంక్ సిబ్బంది మీ అకౌంట్ నుంచి లావాదేవీలు జరగకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. లేదా మీరే బ్యాంక్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా మీ డెబిట్ కార్డు లాక్ చేసుకోవడం, యూపీఐ లావాదేవీలు జరగకుండా లాక్ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. దీని వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని వల్ల మీ డబ్బులను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను మీ వద్ద ఉంచుకోండి. లావాదేవీల ఐడీలు, కచ్చితమైన టైమ్‌స్టాంప్‌లు, SMS హెచ్చరికలు, కస్టమర్ కేర్‌తో జరిపిన కాల్ లాగ్‌లను భద్రపరచుకోండి. మీరు ఫిర్యాదు చేయడానికి , బ్యాంక్ వేగంగా మీ ఫిర్యాదును ప్రాసెస్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మోసం జరిగిన మూడు రోజుల్లోగా మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే నిధులు తిరిగి పొందటంలో జాప్యం జరుగుతుంది. అర్థరాత్రి మోసం జరిగితే ముందుగా కస్టమర్ కేర్ లేదా బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఉదయం బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లండి. మీకు జరిగిన సైబర్ మోసం గురించి వివరించండి. దీని వల్ల మీ ఫిర్యాదు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. మోసం పెద్దది అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల త్వరగా మీకు పరిష్కారం లభిస్తుంది.
