AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖానికి ఆవిరి పడుతున్నారా? అసలు నిజాలేంటో డర్మటాలజిస్ట్ మాటల్లో తెలుసుకోండి!

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం మెరుస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే దీనిపై ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ జుష్య భాటియా సరిన్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకోవడం లేదా మూతపడటం జరగదు. ఇది కేవలం చర్మం పైపొరను మెత్తగా చేసి, మృతకణాలు, జిడ్డును సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 2-3 నిమిషాల పాటు కేవలం నిపుణులు చెప్పిన పద్ధతిలోనే పాటించాలని సూచిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Jyothi Gadda
|

Updated on: Oct 24, 2026 | 10:18 AM

Share
అందమైన, గ్లోయింగ్ స్కిన్ కోసం చాలామంది రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటి వైద్యం ఫేషియల్ స్టీమింగ్..ఆవిరి పట్టడం. ముఖానికి ఆవిరి పడితే చర్మ రంధ్రాలు తెరుచుకుని, మురికి పోయి చర్మం మెరుస్తుందని అందరూ భావిస్తారు. కానీ, అసలు ఆవిరి పట్టడం వల్ల చర్మానికి ఏం జరుగుతుంది? ఇది నిజంగా పనిచేస్తుందా? అనే విషయాలపై ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ జుష్య భాటియా సరిన్ పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు.

1 / 5
చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయా?: చాలామంది ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయని అనుకుంటారు. కానీ, నిపుణుల ప్రకారం.. ఆవిరి వల్ల పోర్స్ తెరుచుకోవడం లేదా మూతపడటం జరగవు. స్టీమింగ్ వల్ల చర్మం పైపొర మెత్తబడుతుంది. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, అదనపు నూనెలు, మృతకణాలు సులభంగా తొలగిపోతాయి. దీనివల్ల ముఖం తాత్కాలికంగా కాంతివంతంగా కనిపిస్తుంది తప్ప, ముఖంపై ఉండే నల్లటి మచ్చలు లేదా పింపుల్స్ ఆవిరితో మాయం కావు.

2 / 5
ఎంతసేపు ఆవిరి పట్టాలి?: చాలామంది ఎక్కువ సేపు ఆవిరిడితే మంచిదని పొరబడుతుంటారు. డర్మటాలజిస్ట్ సూచన ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆవిరి పట్టాలి. ప్రతిసారీ 2 నుంచి 3 నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అంతకంటే ఎక్కువ సేపు పడితే చర్మం డ్రైగా మారిపోవడం, ఎర్రబడటం లేదా చికాకు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

3 / 5
నీటిలో ఏం కలపాలి?: ఆవిరి పట్టే నీటిలో నిమ్మరసం, ఉప్పు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ వంటివి కలపాల్సిన అవసరం లేదని డాక్టర్ జుష్య స్పష్టం చేశారు. కేవలం సాదా నీటిని మాత్రమే ఉపయోగించడం శ్రేయస్కరం. రసాయనాలు లేదా నూనెలు కలిపితే కొందరిలో చర్మ అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

4 / 5
ఆవిరి పట్టిన తర్వాత చేయాల్సిన పని: ఆవిరి పట్టిన వెంటనే తువ్వాలుతో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మెల్లగా తుడుచుకున్న తర్వాత తప్పనిసరిగా మంచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇది చర్మంలో తేమను బంధించి, చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. నిపుణుల సూచనలు పాటిస్తూ సరిగ్గా ఆవిరి పడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో