- Telugu News Photo Gallery Ugadi 2024: Decorate your home beautifully this Ugadi, check here is details
Ugadi Decoration Ideas: ఈ ఉగాదికి మీ ఇంటిని ఇలా చక్కగా అలంకరించండి..
తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన అంటే మంగళవారం ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ అంటే కేవలం పచ్చడి తినడం మాత్రమే కాదు. మారుతున్న కాలాల ప్రకారం.. జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం. పండుగ వచ్చిందంటే.. ఇంటిని ఎలా అలంకరించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సారి మీ కోసం మంచి డెకరేషన్ ఐడియాలు తీసుకొచ్చాం. అరటి ఆకులతో ఇప్పుడు చాలా రకాల డెకరేషన్స్..
Updated on: Apr 05, 2024 | 5:59 PM

తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన అంటే మంగళవారం ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ అంటే కేవలం పచ్చడి తినడం మాత్రమే కాదు. మారుతున్న కాలాల ప్రకారం.. జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం. పండుగ వచ్చిందంటే.. ఇంటిని ఎలా అలంకరించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సారి మీ కోసం మంచి డెకరేషన్ ఐడియాలు తీసుకొచ్చాం.

అరటి ఆకులతో ఇప్పుడు చాలా రకాల డెకరేషన్స్ చేస్తున్నారు. అలాగే మీ పండుగను మరింత ఆనందంగా జరుపుకోవడానికి.. అరటి ఆకులను తీసుకొచ్చి.. మీ ఇంటి ప్రవేశ ద్వారం ముందు పెట్టండి. అరటి చెట్లు పెడితే మరింత అందంగా ఉంటుంది.

పూలతో కూడా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. తాజాగా ఉండే పూలను తీసుకొచ్చి ఇంటి ప్రధాన ద్వారం, పూజ గదిని అలంకరించవచ్చు. అలాగే పూలతో ఇంటి మధ్యలో ముగ్గులా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటివల్ల మీ ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది. ఆ పూలకు లైటింగ్ పెడితే.. అందం మరింత రెట్టింపు అవుతుంది.

అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారాన్ని పువ్వులు, మామిడి తోరణాలతో చక్కగా అలంకరించండి. దీంతో చూడ ముచ్చటగా అనిపిస్తుంది. ఇంటికి ఒక కొత్త కళ వస్తుంది.

మరింత ప్రత్యేక ఆకర్షణగా ఇల్లు ఉండాలంటే.. ఇంటి ముందు రంగులతో మంచి ముగ్గు వేయండి. ఈ ముగ్గుతోనే ఇంటికి సగం పండుగ కళ వస్తుంది. అంతే కాకుండా మామిడి కాయలు, చిలుకల థీమ్‌తో ముగ్గు వేస్తే అద్భుతంగా ఉంటుంది.




