- Telugu News Photo Gallery Tomato Price: Not 50, 100, 1 kg tomato is available here for only 40 rupees
Tomato Price: దిగి వస్తున్న టమాట ధరలు.. ఇక్కడ కిలో 40 రూపాయలు
ప్రస్తుతం దేశంలోనే అసోంలో అత్యంత చౌకైన టమాటా అమ్ముడవుతోంది. ఇక్కడి బార్‌పేటలో కిలో టమాట ధర రూ.40. ఇలాంటి పరిస్థితుల్లో సమీప జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి టమాట కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో బార్‌పేట తర్వాత, పంజాబ్‌లోని రోపర్‌లో చౌకైన టమోటాలు అమ్ముడవుతున్నాయి. ఇక్కడ కిలో టమాటా ధర రూ.41..
Updated on: Aug 10, 2023 | 9:21 PM

ఇక ఏపీలోని రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా దిగుబడి అవుతోంది. తెలంగాణలోనూ టమాటా దిగుబడి పెరిగింది. అంతేకాకుండా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా టమాటా అధికంగా రవాణా కావడంతో హైదరాబాద్‌లోని వివిధ రైతు బజార్లలో శుక్రవారం మొదటి రకం టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది.

రెండో రకం టమాటా కిలో రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది. ఇదే మాదిరి నిన్న గురువారం కూడా టమాటా ధర భారీగా పతనమైంది. మేలి రకం టమాటా కిలో రూ. 50 నుంచి రూ.64 వరకు ధర పలకగా.. రెండో రకం టమాటా కిలో రూ.36 నుంచి రూ.48 వరకు పలికింది.

టమాటా దిగుబడి పెరగడంతో టమాటా ధరలు తగ్గాయని, ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా టమాట ధర భారీగా పెరగడంతో అనేక మంది రైతులు టమాటా సాగు చేస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలికింది. గత నెలలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా గత వారం రోజులుగా టమాటా దిగుబడి పెరిగింది. దీంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లోని రైతు బజార్‌లలో కిలో టమాటా గత సోమవారం రూ.63 నుంచి రూ.70 పలికింది.

శ్రీనగర్ తర్వాత హర్యానాలోని పంచకులలో అత్యంత చౌకైన టమోటాలు అమ్ముడవుతున్నాయి. ఇక్కడ కిలో టమాటా ధర రూ.90. రానున్న రోజుల్లో టమాటా ధర మరింత తగ్గుతుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. అయితే హర్యానాలోని అన్ని జిల్లాల్లోనూ టమాటా ధర ఒకేలా లేదు. వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్‌లో కిలో టొమాటో ధర రూ.140. కాగా, ఢిల్లీలో టమాటా ధర కిలో రూ.140 మాత్రమే.





























