- Telugu News Photo Gallery This vegetable is best in cleansing blood, Check Here is Details in Telugu
Snake Gourd: రక్తాన్ని శుభ్రం చేయడంలో ఈ కూరగాయ బెస్ట్.. డోంట్ మిస్!
కూరగాయల్లో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలా మంది ఈ కూరగాయను తినరు. ఈ కూరగాయ తినడం వల్ల అనేక రకాల సమస్యలను కంట్రోల్ చేయవచ్చు..
Updated on: Nov 22, 2024 | 4:52 PM

పొట్లకాయ అంటేనే చాలా మంది వాంతులు చేసుకుంటూ ఉంటారు. పొట్లకాయను తినేందుకు అస్సలు ఇష్ట పడరు. ఎంతో మంది పొట్లకాయను దూరం పెడుతూ ఉంటారు. పొట్ల కాయ తినడం వల్ల ఏదన్నా జరుగుతుందన్న అపోహలు చాలానే ఉన్నాయి. కానీ పొట్లకాయ తింటే ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

పొట్లకాయను బాలింతలకు పెట్టడం వల్ల పాలు చక్కగా పడతాయి. బాలింత ఆరోగ్యానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. పొట్లకాయలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది.

రక్తంలో ఉండే మలినాలు, విష పదార్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపించి, శుద్ధి చేయడంలో ఇది ఎంత చక్కగానో పని చేస్తుంది. పొట్లకాయ తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా పొట్లకాయ రసం తాగితే ఎలాంటి సమస్యలైనా కంట్రోల్ అవ్వాల్సిందే. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి వాటి నుంచి రక్షిస్తుంది. అధిక బరువును కూడా కంట్రోల్ చేస్తుంది.

శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా కరిగేలా చేస్తుంది. ఇది తింటే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. కామెర్లు కూడా తగ్గుతాయి. పొట్లకాయ రసాన్ని తలకు పట్టించి.. గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య కంట్రోల్ అవుతుంది.




