- Telugu News Photo Gallery This is the problem of not being able to focus on anything, Check here is details in Telugu
Concentration Problem: ఏ విషయంపైనా ఫోకస్ పెట్టలేక పోతున్నారా.. ఇదే సమస్య!
ఏ పని చేయాలన్నా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మీరు అనుకున్న పని పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. కానీ మీరు ఏకాగ్రత పెట్టకుండా చికాకు, కోపం వస్తుందా.. అయితే మీలో ఖచ్చితంగా సమస్య ఉందని అర్థం. చాలా మంది పనులను వాయిదా వేస్తూ వస్తారు. దీనికి ముఖ్య కారణం ఏకాగ్రత నశించడమే. మీరు ఏకాగ్రత పెట్టకపోవడానికి కూడా కారణం ఉంది. సాధారణంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. వాటిల్లో ఫ్యాటీ యాసిడ్స్..
Updated on: Sep 09, 2024 | 1:12 PM

ఏ పని చేయాలన్నా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మీరు అనుకున్న పని పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. కానీ మీరు ఏకాగ్రత పెట్టకుండా చికాకు, కోపం వస్తుందా.. అయితే మీలో ఖచ్చితంగా సమస్య ఉందని అర్థం. చాలా మంది పనులను వాయిదా వేస్తూ వస్తారు. దీనికి ముఖ్య కారణం ఏకాగ్రత నశించడమే.

మీరు ఏకాగ్రత పెట్టకపోవడానికి కూడా కారణం ఉంది. సాధారణంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. వాటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవసరమే. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాన్ని సంగ్రహణకు ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.

శరీరంలో ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే ఆరోగ్య పరంగానే కాదు మానసికంగా కూడా ఎఫెక్ట్ పడుతుంది. వీటి ప్రభావం నేరుగా గుండె ఆరోగ్యం, బ్రెయిన్‌పై పడుతుంది. దీంతో ఏ విషయంపైన కూడా సరైన విధంగా ధ్యాస ఉంచరు. కొద్ది సమయానికే చికాకు అనేది వస్తుంది.

అంతే కాకుండా దేని పైనా దృష్టి సారించలేక పోతారు. శ్రద్ధ ఉండదు.. ఇతర పనులకు డైవర్ట్ అవుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో విసుగు, అశాంతి అనేవి పెరుగు పోతాయి. కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. కాబట్టి ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఇవి ఎక్కువగా చేపల్లో, చియా సీడ్స్, నట్స్, ఆలివ్ ఆయిల్‌లో లభిస్తాయి. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ లోపి్తే ఇతర సమస్యలు కూడా చాలా ఉత్పన్నం అవుతాయి. పీరిడయ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, కళ్ల సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




