- Telugu News Photo Gallery These are the rules to be followed while performing Jalabhishekam on the Shiva Linga
శివలింగానికి జలాభిషేకం చేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే మహాపాపం!
పరమశివుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం . అందుకే శ్రావణ మాసంలో పరమశివుడిని భక్తితో కొలుచుకుంటే కష్టాలు తీరిపోతాయి అంటారు పండితులు. అయితే ఈ సారి శ్రావణ మాసం జూలై 11న ప్రారంభమై, ఆగస్టు9తో ముగుస్తుంది.
Updated on: Jul 04, 2025 | 3:22 PM

శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో శివ భక్తులు నిష్టగా శివయ్యను కొలుచుకుంటారు. ఇక హిందూ సంప్రదాయాల ప్రకారం , ఈ పవిత్ర మాసంలో శివుడికి జలాభిషేకం, వంటివి చేయడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా శివలింగానికి నీటిని సమర్పిస్తే ఆనందం, శ్రేయస్సు, ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కానీ శివుడికి జలాభిషేకం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఒక వేళ నియమాలను ఉల్లంఘించి జలాభిషేకం చేస్తే అది మహాపాపం అంట.

శ్రావణ మాసంలో శివలింగానికి జలాభిషేకం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయని శివ పురాణంలో తెలపడం జరిగింది. ఈ సమయంలో సముద్ర మథనం జరిగింది, దీంతో విశ్వాన్ని రక్షించడానికి శివుడు విషాన్ని స్వీకరించాడు. దీంతో విష ప్రభావాన్ని తగ్గించడం కోసం దేవతలు, బుషులు, ఈ సమయంలో శివుడిపై నీటిని పోశారు. అప్పటి నుంచి శ్రావణ మాసంలో జలాభిషేకం చేయడం అనే సంప్రదాయం ప్రారంభమైంది. ఇక ఈ జలాభిషేకం చేసే క్రమంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి.

శివ లింగానికి నీటిని సమర్పించేటప్పుడు ఎట్టిపరిస్థితిలో నిటారుగా నిల్చొని జలాభిషేకం చేయకూడదంట. ఇది మహాపాపం అంటున్నారు పండితులు. నిటారుగా నిల్చొని జలాభిషేకం చేయడం అని అగౌరవంగా పరిగణించబడుతుందంట. అందుకే నిల్చొని నీటిని సమర్పించడం కంటే కూర్చొని లేదా వంగినట్లుగా శివలింగానికి జలాభిషేకం చేయాలంట.

అలాగే, జలాభిషేకం చేసే సమయంలో కొంత మంది తెలియక శంఖం ఉపయోగిస్తారు. కానీ ఇలా అస్సలే చేయకూడదంట. శంఖచుడ్ అనే రాక్షసుడిని అంతం చేయడం వలన శంఖాలు ఏర్పడ్డాయంట. అంతే కాకుండా శంఖచుడ్ విష్ణువు భక్తుడంట. అందుకే శంఖం ద్వారా నీరు విష్ణువు లేదా లక్ష్మీ దేవికి సమర్పించవచ్చునంట కానీ, శివుడికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో శంఖం ద్వారా జలాభిషేకం చేయకూడదంట.

అదే విధంగా శివుడికి జలాభిషేకం చేసే క్రమంలో తులసి ఆకులను సమర్పించకూడదంట. అలాగే పసుపు, కుంకుమలును కూడా శివుడికి సమర్పించడం నిశిద్ధం అంటున్నారు పండితులు, పసుపు కుంకుమలు, స్త్రీ సౌందర్యం, వైవాహిక జీవితం, సంతానోత్పత్తికి సంబంధించినవి, కానీ శివుడు పురుష శక్తిని సూచిస్తాడు, అలాగే అతను వైరాగి, సన్యాసి, అందుకే శివయ్యకు పసుపు,కుంకుమలు సమర్పించకూడదంట.



