- Telugu News Photo Gallery These are the five sweet fruits that you should not eat on an empty stomach
ఖాళీ కడుపుతో తినకూడని తియ్యటి పండ్లు ఇవే!
పండ్లు తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. అందుకే తప్పనిసరిగా రోజుకు కనీసం ఒక్క పండైనా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. కానీ ఖాళీ కడుపుతో అస్సలే ఈ ఐదురకాల పండ్లు తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Jun 29, 2025 | 9:30 AM

తియ్యటి పండ్లల్లో పైనాపిల్ ఒకటి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అయితే దీనిని తినడం వలన అనేక లాభాలు ఉన్నప్పటికీ, ఖాళీ కడుపుతో మాత్రం ఎప్పుడూ తినకూడదని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే ? ఈ పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉండటం వలన ఖాళీ కడుపుతో పైనాపిల్ తినడం వలన ఇది కడుపులో సన్నటి పొరపై ప్రతికూల ప్రభావాన్ిన చూపుతుందంట.అలాగే పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నదంట.

జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే జీర్ణ సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని ఖాళీ కడుపుతో తినకూడదంట. ఎందుంకంటే? వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయంట. అందువలన జామ పండ్లను ఖాళీ కడుపుతో తినడం కంటే భోజనం చేసిన తర్వాత తినడం చాలా ఉత్తమం.

ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి ఒకటి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇక రక్తహీనతతో బాధపడేవారు దీనిని తినడం వలన అనేక లాభాలు ఉంటాయంటారు. అంతే కాకుండా బొప్పాయిలో అనేక పోషకాలు, విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. అందువలన తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఈ పండు తినాలంటారు. అయితే దీనిని ఎట్టిపరిస్థితుల్లో ఖాళీ కడుపుతో తినకూడదంట. దీని వలన ఇది కడుపులో చికాకు కలిగించడం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఆపిల్ పండ్లు తినడం ఎవరికి ఇష్టం ఉండదు. తియ్యగా ఉండే పండ్లలో ఇవి ఒకటి. రోజుకు ఒక ఆపిల్ తినడం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే జీర్ణశక్తి సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం మంచిది కాదంట. ఈ పండులో సహజ ఆమ్లాలు, అధిక ఫైబర్ ఉండటం వలన ఇవి కడుపులో ఆమ్లస్థాయిలను పెంచుతాయి. దీంతో జీర్ణసమస్యలు పెరిగే ప్రమాదం ఉన్నదంట.

అరటి పండు ఎముకల బలానికి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అయితే తప్పకుండా రోజుకు ఒక అరటి పండు తినాలని వైద్యులు సూచిస్తారు. కానీ దీనిని ఎప్పుడూ అన్నం తిన్న తర్వాత తినడమే మంచిదంట. అరటి పండును ఖాళీ కడపుతో తినకూడదంట. దీనిని ఖాళీ కడుపుతో తినడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదంట, ఎందుకంటే ఇది రక్తంలో మెగ్నీషీయం స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.



