అసలే వర్షాకాలం.. జ్వరం వచ్చి ఎంతకూ తగ్గడం లేదా.. బెస్ట్ టిప్స్ మీ కోసం
వర్షకాలం ప్రారంభమైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. అయితే వాతావరణం మార్పులతో కొంత మంది జ్వరం, జలుబు వంటి సమస్యలతో సతమతం అవుతుంటారు. కొన్ని సార్లు జ్వరం వచ్చి అస్సలే తగ్గదు. ఈ సమయంలో కంగారు పడిపోతుంటారు. అయితే వర్షం వచ్చి తగ్గకపోతే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jun 09, 2025 | 1:44 PM

వర్షాకాలంలో జ్వరం రావడం అనేది చాలా కామన్. అయితే ఏదైనా వ్యాధి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వస్తుంటుంది. చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడంతో విపరీతమైన జ్వరం, చలి, బలహీనత వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని సార్లు జ్వరం వచ్చి రెండు లేదా మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ కొన్ని సార్లు ఎన్ని మందులు వాడినా జ్వరం అనేది అస్సలే తగ్గదు.

ఆసుపత్రికి వెళ్లి, ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ పరిస్థితి అలానే ఉంటుంది. అయితే దీని కోసం కొన్ని టిప్స్ పాటించాలంట. ముఖ్యంగా జ్వరం వచ్చిన వ్యక్తి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలంట. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు శరీరం అలసిపోతుంది. చాలా నీరసంగా ఉంటుంది. అందువలన తగినంత నిద్ర పోయి విశ్రాంతి తీసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందంట.

జ్వరం వచ్చి సమయంలో అల్లం టీ లేదా? అల్లం తేన మిశ్రమం తీసుకోవడం వలన అది శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ఎందుకంటే అల్లం శరీరంలోని వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడుతుంది. అలాగే తేన గొంతుకు ఉపశమనం ఇస్తుంది. అందువలన అరటీస్పూన్ అల్లం రసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగాలంట. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

ఎప్పుడూ శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచుకోవాలంట. జ్వరం వచ్చినప్పుడు శరీరంలో నీటి కొరత ఏర్పడి, ఎక్కువగా దాహం వేస్తుంది. అంతే కాకుండా చాలా నీరసం, అలసట ఏర్పడుతుంది. అందువలన గోరు వెచ్చటి నీటిని పదే పదే తాగుతుండాలి. దీని వలన శరీరం హైడ్రెటెడ్‌గా ఉంటుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుందంట.

జ్వరం వచ్చినప్పుడు శరీరం చాలా వేడిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నొదట, ఛాతిపై ,మెడ భాగంలో చాలా వేడిగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో కాటన్ క్లాత్ తీసుకొని చల్లటి నీటిలో పెట్టి ఆ వస్త్రాన్ని వేడి ఉన్న ప్రదేశంలో చిన్నగా మసాజ్ చేయాలి. దీని వలన జ్వరం తగ్గే అవకాశం ఉంటుంది



















