- Telugu News Photo Gallery These are the benefits of lighting a ghee lamp, check here is details in Telugu
Ghee Diya Benefits: నెయ్యి దీపం వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఇవే!
సనాతన హిందూ ధర్మంలో దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది స్వచ్ఛమైన అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. దీపం మనల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది. మానవాళికి శాంతి, కాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడమే దీపం గొప్పదనం. శ్రావ్యమైన వాతావరణాన్ని సృష్టించడానికి, గాలిని శుద్ధి చేయడానికి దీపాలు ఉపయోగపడతాయి. దీపం మనస్సు, శరీరాన్ని పునరుజ్జీవింప బడతాయి. ఇతర నూనెల దీపాల కంటే ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడం వల్ల పలు ప్రయోజనాలు..
Updated on: Jan 22, 2024 | 7:38 PM

సనాతన హిందూ ధర్మంలో దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది స్వచ్ఛమైన అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. దీపం మనల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది. మానవాళికి శాంతి, కాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడమే దీపం గొప్పదనం. శ్రావ్యమైన వాతావరణాన్ని సృష్టించడానికి, గాలిని శుద్ధి చేయడానికి దీపాలు ఉపయోగపడతాయి. దీపం మనస్సు, శరీరాన్ని పునరుజ్జీవింప బడతాయి. ఇతర నూనెల దీపాల కంటే ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపాలకు చుట్టూ ఉన్న గాలి నుండి సాత్విక ప్రకంపనలు వచ్చే శక్తి ఉంటుంది. దీపం వెలగటం వలన సాత్వికత గుణాన్ని ప్రభావితం చేస్తుంది. నెయ్యి దీపం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి.. పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూస్తుంది.

నెయ్యి దీపం నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల పలు రకాల వ్యాధులు రాకుండా దూరం అవుతాయి. దీపం ఇంటికి పురుగు మందులా పని చేస్తుందని నిపుణులు అంటారు. నెయ్యి దీపం వెలిగించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల సంఖ్య కూడా తగ్గుతుంది.

సూర్యోదయం లేదా సంధ్యా సమయంలో దీపం వెలిగించడం వల్ల పర్యావరణానికి, ప్రజలకు వైద్యంగా పని చేస్తుంది. దీపాలను వెలిగించడం వల్ల చెడుపై మంచి సాదించిన విజయానికి ప్రతీకగా ఉంటుంది. నెయ్యి దీపాలతో దేవుడిని అభ్యర్థిస్తున్నప్పుడు దైవ సన్నిదిని కోరే మార్గంగా చెప్పొచ్చు.

నెయ్యి దీపం మెరుపుతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వేడుక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. నెయ్యి దీపం మనశ్శాంతిని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. నెయ్యి దీపం దుష్టశక్తులను దూరం చేస్తుంది. మానసిక స్పష్టతను పెంపొందిస్తుంది.





























