- Telugu News Photo Gallery These 3 Yoga Poses are Effective for Strengthening the Immunity in Your Body See Here Full Details
Yoga Poses: ఈ 3 యోగాసనాలు మీలోని రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి.. పూర్తి వివరాలు మీకోసం..
Yoga Poses - Immunity: ఇన్ఫెక్షన్స్, వైరల్ జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తి సహాయపడుతుంది. అందుకే చాలా మంది తమలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల ఫుడ్స్, ఇతర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, అన్నింటికంటే ఎక్కువగా యోగా ప్రభావం చూపుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
Updated on: Oct 28, 2021 | 8:24 PM

వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం యోగా. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. ఇందులోని యోగాసనాలను ఆచరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత కరోనా కాలంలో ప్రతీ ఒక్కరిలో ఇమ్యూనిటీ చాలా అవసరం. ఇమ్యూనిటీ ఉంటే.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం చాలా సులభం అని వైద్యులు చెబుతున్నారు. అయితే, శరీరంలో ఇమ్యూనిటీ పెంచేందుకు 3 రకాల యోగాసనాలు బాగా ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి 3 రకాల యోగాసనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మత్స్యాసనం: ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. అరికాళ్లను, చేతులతో పట్టుకోవాలి ఆ తరువాత నెమ్మదిగా తల వెనుకవైపు వాల్చాలి. అలా తల నేలకు తాకించి.. ఛాతి భాగాన్ని మాత్రం పైకి లేపాలి. ఈ ఆసనంలో ఉండి శ్వాస పీల్చుతూ వదులుతూ 2 - 3 నిమిషాల పాటు ఉండాలి.

ఉత్తనాసనం: ముందుగా స్ట్రైట్‌గా నిలబడాలి. మీ కాళ్ల మధ్య కొద్ది దూరం ఉంచాలి. నడుమును ముందుకు వంచి.. తలను పాదాలకు ఆన్చాలి. చేతులతో చీలమండలను పట్టుకోవాలి. అలా కాసేపు ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి. ఇలా కాసేపు ఉండాలి.

భుజంగాసనం: నేలపై బోర్లా పడుకోవాలి. కాలి వేళ్లను వెనక్కి చూపాలి. అరచేతులను ఛాతికి ఇరువైపులా పెట్టి.. చేతులపై పైకి లేవాలి. రెండు అరచేతులను నేలకు ఆనించి.. మోచేతులు నిటారుగా ఉంచండి. నుదిటినిపైకి ఎత్తండి. నుదిటిని పైకి ఎత్తిన సమయంలో శ్వాస తీసుకోవడం, కిందకు దించిన సమయంలో శ్వాస విడవటం చేయాలి. అలా కాసేపు ఈ ఆసనం చేయాలి.





























