- Telugu News Photo Gallery The remaining pieces of soap can be used in so many ways, check here is details
Kitchen Hacks: మిగిలిన సబ్బు ముక్కలు ఇన్ని రకాలుగా ఉపయోగ పడుతుందా..
ప్రస్తుత కాలంలో అందంపై శ్రద్ధ అనేది బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన బాడీ సబ్బులను కొటున్నారు. మార్కెట్లో ఎన్ని లిక్విడ్ సబ్బులు వచ్చానా.. సబ్బులు వాడే వారి సంఖ్య ఎక్కువే. అయితే స్నానం చేసే సమయంలో సబ్బు ముక్కలు మిగిలిపోవడం సర్వ సాధారణం. ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కలను పడేస్తూ ఉంటారు. కానీ వీటిని కూడా మనం ఎన్నో రకాలు ఉపయోగించు కవోచ్చు. మరి ఎలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఇంట్లో ఉండే చెక్క తలుపుల..
Updated on: Sep 20, 2024 | 6:36 PM

ప్రస్తుత కాలంలో అందంపై శ్రద్ధ అనేది బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన బాడీ సబ్బులను కొటున్నారు. మార్కెట్లో ఎన్ని లిక్విడ్ సబ్బులు వచ్చానా.. సబ్బులు వాడే వారి సంఖ్య ఎక్కువే. అయితే స్నానం చేసే సమయంలో సబ్బు ముక్కలు మిగిలిపోవడం సర్వ సాధారణం.

ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కలను పడేస్తూ ఉంటారు. కానీ వీటిని కూడా మనం ఎన్నో రకాలు ఉపయోగించు కవోచ్చు. మరి ఎలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఇంట్లో ఉండే చెక్క తలుపుల నుంచి శబ్దం అనేవి వస్తుంది. ఇలా తలుపుల నుంచి సౌండ్ రాకూడదంటే.. డోర్ సైడర్లకు సబ్బును రాయండి.

అలాగే వార్డ్ బోర్డ్, ఇతర షల్ఫ్‌లో దుర్వాసన రాకుండా సువాసన రావడానికి ఫ్రెషనర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటి బదులుగా ఈ మిగిలిపోయిన సబ్బు ముక్కలను టిష్యూ పేపర్ లేదా ఓ క్లాత్‌లో కట్టి వార్డ్ బోర్డ్స్‌లో ఉంచితే చాలా మంచిది.

మిగిలి పోయిన సబ్బు ముక్కలతో జాకెకట్, బ్యాగ్, ప్యాంట్ జిప్స్‌లను కూడా సరిగా పనిచేసేలా చేయవచ్చు. ఒక్కో సారి జిప్స్ స్టవక్ అయిపోతూ ఉంటాయి. వీటిని లాగడానికి బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సబ్బును వాటిపై రాస్తే.. జిప్ సమస్యలు ఉండవు.

అదే విధంగా ఇంటి కీ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇంటి, గేటు తాళాలు పాతవి అయినప్పుడు వాటిని తెరవడం, లాక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీటిని సులభంగా తెరవాలంటే.. బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా లాక్ కీకి సబ్బు రాయడం వలన ఈజీగా తాళం కప్ప ఓపెన్ అవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




