- Telugu News Photo Gallery The combination of Jupiter and Venus brings success in work for these four zodiac signs
గురు శుక్రుల కలయికతో అదృష్టం కలిసి వచ్చే రాశులివే!
జ్యోతి శ్యశాస్త్రంలో గురు, శుక్రగ్రహాలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ రాశుల కలయికను చాలా శుభసూచకంగా పరిగణిస్తారు. అయితే జూన్5 తేదీన ఈ రండు గ్రహాల కలయిక జరగబోతుంది. ఒకదానికి ఒకటి 60 డిగ్రీల కోణంలో కలవనున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుు మనం తెలుసుకుందాం.
Updated on: May 30, 2025 | 8:54 PM

కుంభ రాశి : గురు శుక్ర గ్రహాల కలయిక వలన కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా వ విజయం సాధిస్తారు. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందుతారు. ఎవరైతే చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది.

కుంభ రాశి : పెళ్లి కాని వారికి కూడా మంచి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఆదాయం పెరుగుతుంది.

మిథున రాశి : గురు శుక్రగ్రహాల కలయిక వలన మిథున రాశి వారికి అప్పుల సమస్యలు తీరిపోతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సొంతింటి కల నెరవేర్చుకుంటారు.ఈ రాశి వారికి గురు గ్రహం ప్రభావం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా సొంతింటి కలు నెరవేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గ్రహాల కలయిక చాలా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు మంచి ర్యాంకులు పొంది సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆనందంగా గడుపుతారు.

తుల రాశి : తుల రాశి వారికి గురు, శుక్ర గ్రహాల కలయికతో అదృష్టం కలిసి రానుంది. వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అవసరానికి డబ్బులు చేతికందుతాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.



