హైదరాబాద్లోనే బెస్ట్ సన్ రైజ్ అండ్ సన్ సెట్ స్పాట్స్.. ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు..
సూర్యోదయం, సూర్యాస్తమయం రెండింటినీ ఆస్వాదించడానికి హైదరాబాద్ నగరంలో ప్రదేశాలు ఉన్నాయి. వీటిని వీక్షణను మీరు లైఫ్ లాంగ్ గుర్తించుకుంటారు. ఉదయం, రాత్రి మధ్య ఆకాశం రంగులు మారినప్పుడు మీరు నగరం బ్యూటీని ఆస్వాదించవచ్చు. మరి భాగ్యనగరంలో ఉత్తమ సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రదేశలు ఏంటో చూద్దామా..
Updated on: Dec 12, 2025 | 8:43 PM

హుస్సేన్ సాగర్ సరస్సు: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద ప్రజలు సూర్యోదయం, అస్తమయం ఆస్వాదించవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో అనువైనదని ఫోటోగ్రాఫర్లు భావిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఇక్కడ వాకింగ్, రన్నింగ్, విశ్రాంతి తీసుకోవచ్చు. హుస్సేన్ సాగర్ సరస్సు సహజ ప్రకృతి దృశ్యాలు మీ హృదయంలో పదిలంగా దాచుకోవచ్చు.

దుర్గం చెరువు: హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న అందమైన దుర్గం చెరువు సూర్యాస్తమయాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. సూర్యాస్తమయ సమయంలో సరస్సు రాతి కొండల మధ్య సూర్యుడు చూస్తే ఆ అనుభూతి వర్ణనాతీతం. నగరంలో తక్కువ మంది ప్రజలు మాత్రమే దీనిని సందర్శించారు. ఫోటోగ్రఫీని ఇష్టపడే వ్యక్తులకు ఇది మంచి ఎంపిక. అలాగే ప్రశాంతమైన సూర్యాస్తమయాన్నీ ఆస్వాదించాలనుకొనే వ్యక్తులకు దుర్గం చెరువు సరైన ప్రదేశం.

గోల్కొండ కోట: హైదరాబాద్‌లోని సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి ప్రధానంగా గోల్కొండ కోటకు సందర్శకులు వస్తారు. కొండ కోట పైన నుండి మీరు నగరంలోని అన్ని ప్రాంతాలను చూడవచ్చు. సూర్యోదయం సమయంలో కోట ఎక్కడం మంచి అనుభూతి కలిగిస్తుంది. చారిత్రాత్మక కోట మైదానాలు, చుట్టుపక్కల ప్రకృతి సూర్యోదయాన్ని చూడటానికి అనువైన ప్రదేశం.

బిర్లా ప్లానిటోరియం: నగరంలోనే సూర్యోదయాన్ని చూడటానికి ఇష్టపడేవారు బిర్లా ప్లానిటోరియంకు వెళ్లాలి. దాని కొండపై నుండి మీరు విస్తరించి ఉన్న మొత్తం పట్టణ నగర దృశ్యాన్ని చూడవచ్చు. ప్రకాశవంతమైన ఉదయం సూర్యుడు రద్దీగా ఉండే నగర రోడ్లను వెలిగిస్తాడు. ప్లానిటోరియం సందర్శకులు ఎక్కువగా ఖగోళ శాస్త్ర అభిమానులు అయినప్పటికీ, దాని సుందరమైన దృశ్యాల కారణంగా ఈ ప్రదేశాన్ని చూడాలి.

ఉస్మాన్ సాగర్ సరస్సు: ప్రశాంతమైన ఉస్మాన్ సాగర్ సరస్సు వద్ద సందర్శకులు సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. హైదరాబాద్ శివార్లలోని ఉన్న ఈ సరస్సు ప్రశాంతమైన పరిసరాలు, జలాలు వీక్షకులను ఆకర్షిస్తాయి. ప్రశాంతమైన సరస్సు జలాలు, దట్టమైన కొండలు సూర్యాస్తమయాన్ని చూడటానికి అనువైన ప్రదేశం. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి లేదా వీకెండ్ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్.




