- Telugu News Photo Gallery Telangana Minister Harish Rao Sells Vegetables at Market in Siddipet, See Pictures
Telangana: కూరగాయలు అమ్మిన మంత్రి.. అవాక్కైన రైతులు, వినియోగదారులు..
ఆయనో ఒక కీలక మంత్రి.. నిత్యం పలు పనుల్లో బిజీ, బిజీగా ఉండే ఆయన.. కాసేపు కూరగాయలు అమ్మారు. మార్కెట్లో ఉన్న రైతులతో కలసి మెలిసి మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ వారితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో వైపు మంత్రి కూరగాయలు అమ్మడం చూసి వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఇంతకీ ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. ఇంకెవరు మాస్ లీడర్ హరీష్ రావు. ఆయన ఏది చేసిన కూడా కొంత వెరైటీ ఉంటుంది.
Updated on: Aug 15, 2023 | 9:03 PM

ఆయనో ఒక కీలక మంత్రి.. నిత్యం పలు పనుల్లో బిజీ, బిజీగా ఉండే ఆయన.. కాసేపు కూరగాయలు అమ్మారు. మార్కెట్లో ఉన్న రైతులతో కలసి మెలిసి మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ వారితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరో వైపు మంత్రి కూరగాయలు అమ్మడం చూసి వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఇంతకీ ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. ఇంకెవరు మాస్ లీడర్ హరీష్ రావు. ఆయన ఏది చేసిన కూడా కొంత వెరైటీ ఉంటుంది.

మంగళవారం నాడు సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి చాలా బీజి, బిజీగా గడిపారు. కాసేపు అలా సిద్దిపేట పట్టణంలోని రైతు బజార్ ను మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న రైతులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. వ్యవసాయ పొలాలకు కరెంటు ఎలా ఉంది, ఎండాకాలంలో చెరువులలో నీళ్లు ఎలా ఉన్నాయని మంత్రి అక్కడి రైతులను ఆప్యాయంగా పలకరించారు.

మరోవైపు ప్రతిపక్షాలు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు అని రైతులను మంత్రి ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇచ్చే వాళ్లను గెంటేసుడే అని ఓ మహిళా రైతు చెప్పడంతో మంత్రి హరీష్ రావు ఆశ్చర్యపోయారు. అనంతరం ఓ వినియోగదారునికి మంత్రి స్వయంగా కూరగాయలు తక్కెడలో తూకం వేసి సంచిలో వేశారు.

మంత్రి స్వయంగా కూరగాయలు తూకం వేసి స్వయంగా సంచిలో వేయడంతో ఆ వినియోగ దారులు సంతోషం అవధులు లేవు. ఏది ఏమైనా మంత్రి హరీష్ రావు ఇలా రైతు బజార్ కి వచ్చి రైతులతో మాట్లాడుతూ కూరగాయలు అమ్మడం చూసిన వారు ఈ మంత్రి స్టైలే వేరే అని అంటున్నారు.
