- Telugu News Photo Gallery Telangana Health Minister Harish Rao Participate in Sunday Clean Day Campaign
Monsoon Health: సీజనల్ వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి.. స్వయంగా అవగాహన కల్పించిన మంత్రి హరీష్ రావు..
వర్షా కాలం వచ్చే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు మన పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. జీహెచ్ఎంసీ పిలుపునిచ్చిన ‘ఆదివారం పది గంటలకు పది నిమిషాలు దోమల నివారణ’ కార్యక్రమాన్ని మంత్రి తన ఇంట్లో చేశారు. తన ఇంటి పరిసరలలో ఉన్న నీటి నిల్వలను తొలగించి, మొక్కల దగ్గర ఉన్న చెత్తని క్లీన్ చేశారు.
Yellender Reddy Ramasagram | Edited By: Shiva Prajapati
Updated on: Jul 23, 2023 | 2:50 PM

వర్షా కాలం వచ్చే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు మన పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. జీహెచ్ఎంసీ పిలుపునిచ్చిన ‘ఆదివారం పది గంటలకు పది నిమిషాలు దోమల నివారణ’ కార్యక్రమాన్ని మంత్రి తన ఇంట్లో చేశారు. తన ఇంటి పరిసరలలో ఉన్న నీటి నిల్వలను తొలగించి, మొక్కల దగ్గర ఉన్న చెత్తని క్లీన్ చేశారు.

జీహెచ్ఏంసీ, గ్రామ పంచాయితీల్లోని సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నా.. మన ఇంటి పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలని సూచించారు మంత్రి హరీష్ రావు.

వర్షా కాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ లు ఎటాక్ చేస్తుంటాయి. దాంతో అందరూ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తుంది. మరి ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.

ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం.. ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆరోగ్యం విషయంలో ‘ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్’ అని అందరూ గుర్తుపెట్టుకోవాలి సూచించారు.