- Telugu News Photo Gallery Technology photos What is a disposable domain scam? Do you know how to prevent it?
Disposable Domain Scam: డిస్పోజబుల్ డొమైన్ స్కామ్ అంటే ఏమిటి.? నివారణ ఎలానో తెలుసా.?
ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పెరగడం వల్ల సైబర్ క్రైమ్ కూడా ఎక్కువ అయిపోతుంది. కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు ఎంచుకొంటున్నారు. వీటిలో డిస్పోజబుల్ డొమైన్స్ స్కామ్ కూడా ఒకటి. అసలు.. డిస్పోజబుల్ డొమైన్స్ స్కామ్ అంటే ఏమిటి? నివారణ ఎలా? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jul 06, 2025 | 4:02 PM

డిస్పోజబుల్ డొమైన్ అనేది తాత్కాలికంగా, సాధారణంగా గంటలు లేదా రోజుల పాటు ఉపయోగించడానికి నమోదు చేయబడిన వెబ్‌సైట్ డొమైన్. సైబర్ నేరగాళ్లు ఈ డొమైన్‌లను ఉపయోగించి నకిలీ ఇమెయిల్ IDలు, వాస్తవంగా కనిపించే వెబ్‌సైట్‌లను సృష్టిస్తారు.

తప్పుడు OTP లేదా లాగిన్ వివరాలను దొంగిలించడానికి లేదా మోసం చేయడానికి ఇవి సృష్టించడం జరుగుతుంది. ఈ సైట్ అసలు సైట్‌ని పోలి ఉంటుంది. వినియోగదారుడు నకిలీ వెబ్‌సైట్ లేదా ఇమెయిల్ ద్వారా ఆకర్షితులవుతారు.

నిజమైన సైట్‌గా భావించి, మీరు వివరాలను నమోదు చేసిన వెంటనే, స్కామర్లు వాటిని దొంగిలిస్తారు. ఈ వెబ్‌సైట్‌లు కొన్ని రోజులు లేదా గంటల్లో అదృశ్యమవుతాయి. వాటిని ట్రాక్ చేయడం కష్టం. వినియోగదారుడు తాను చిక్కుకున్నట్లు కూడా తెలియదు.

తెలియని వెబ్‌సైట్‌లో మీ సమాచారాన్ని నమోదు చేయవద్దు. వెబ్‌సైట్ URLని జాగ్రత్తగా తనిఖీ చేయండి. తాత్కాలిక ఇమెయిల్ ID నుండి వచ్చిన సందేశాలపై అసలు క్లిక్ చేయవద్దు. లేదంటే కొంపకొల్లేరు..!

అధికారిక, ప్రభుత్వ సైట్‌లలో మాత్రమే వివరాలను నమోదు చేయండి. 2FA (టూ-ఫాక్టర్ ప్రామాణీకరణ)ని ఆన్‌లో ఉంచండి. మీ పాస్‌వర్డ్, UPI పిన్‌ను వెంటనే మార్చుకోండి. వెంటనే మీ బ్యాంకు లేదా సంబంధిత సేవకు తెలియజేయండి. సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.




