- Telugu News Photo Gallery Technology photos Reliance Jio launches RS 299 plan for Jio Cinema OTT platform, Check here for full details
OTT: ఓటీటీ లవర్స్‌కి జియో బంపరాఫర్.. రూ. 299తోనే ఏడాది..
కరోనా తదనంతనర పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీల హవా ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ప్రముఖ సంస్థలన్నీ ఈ రంగంలోకి అడుగుపెట్టడం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ కంటెంట్ క్రియేషన్స్‌లోకి రావడంతో ఓటీటీకి క్రేజ్ పెరుగుతోంది. దీంతో దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెలికం సంస్థ జియో సైతం జియో సినిమా పేరుతో ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే..
Updated on: May 27, 2024 | 9:38 PM

ప్రముఖ టెలికం రంగ సంస్థ జియో.. జియో సినిమా పేరుతో ఓటీటీ రంగలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ను ఉచితంగా అందించి. అందరి దృష్టిని ఆకర్షించిన జియో ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను లాంచ్ చేస్తోంది.

ఇందులో భాగంగానే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను జియో ఏప్రిల్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే యూజర్లకు శుభవార్త చెబుతూ జియో ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఏడాదికి కేవలం రూ. 299తోనే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పొందొచ్చు. ఈ ప్లాన్‌తో కంటెంట్‌ను ఎలాంటి ప్రకటనలు లేకుండా 4కేలో వీక్షించవచ్చు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌లో ఇదే తక్కువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా జియో ఈ వార్షిక ప్లాన్‌ను కంపెనీ రూ. 599గా నిర్ణయించారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 299కే అందిస్తోంది. ఇందులో హెచ్‌బీవో, పారామౌంట్, పీకాక్, వార్నర్ బ్రోస్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌజులు, ఓటీటీ ప్లాట్‌ఫాంలకు సంబంధించిన కంటెంట్ లభించనుంది.

ఇదిలా ఉంటే ఐపీఎల్, ఇతర స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్‌లో మాత్రం ప్రకటనలు డిస్‌ప్లే అవుతాయని కంపెనీ చెబతోంది. ఇదిలా ఉంటే జియో ప్రస్తుతం రూ. 89 ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకుంటే.. నాలుగు డివైస్‌ల్లో ఒకేసారి స్ట్రీమ్ చేయవచ్చు.




