- Telugu News Photo Gallery Technology photos Whatsapp planning to introducing new feature clear and read message count, Check here for full details
WhatsApp: కుప్పలు తెప్పలుగా వస్తున్న మెసేజ్‌లతో ఇబ్బందిగా ఉందా.? వాట్సాప్‌లో కొత్త ఫీచర్
ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2.78 బిలియన్ల మంది యూజర్లతో అత్యదిక మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది..
Updated on: May 27, 2024 | 6:58 PM

వాట్సాప్‌లో నిత్యం మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్‌ల కారణంగా నిత్యం ఏదో ఒక గ్రూప్‌లో మెసేజ్‌లు వస్తుంటాయి. దీంతో వాట్సాప్ చాట్స్ అన్ని మెసేజ్‌లతో నిండి పోతుంటాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ఇది యూజర్లకు ఇబ్బందిగా మారుతుంది.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసే పనిలో పడింది. కుప్పలు తెప్పలుగా వచ్చే మెసేజ్‌లు, ఫొటోల కారణంగా ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ 'క్లియర్ అండ్ రీడ్ మెసేజ్ కౌంట్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు చదవని మెసేజ్‌లను ఓపెన్ చేయగానే ఆటోమేటిక్‌గా వాటంతటవే క్లియర్ అవుతాయి.

దీంతో వాట్సాప్‌లో చాట్స్‌లో ఇకపై 'అన్ రీడ్' మెసేజ్‌లను కౌంట్ చాట్‌లో చూపించదు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.11.13 బీటా వర్షెన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. అనంతరం యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ఇటీవల వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేజ్‌ను కూడా పూర్తి స్థాయిలో మార్చిన విషయం తెలిసిందే. గ్రీన్ కలర్ లోగోతో పాటు, బ్యాగ్రౌండ్ కలర్‌ను వైట్ కలర్‌లోకి మార్చిన విషయంత తెలిసిందే.




