- Telugu News Photo Gallery Technology photos Realme launches new smartphone in india Realme GT 6T features and price details
Realme GT 6T: మార్కెట్లోకి వచ్చేసిన రియల్ మీ కొత్త ఫోన్.. స్టన్నింగ్ ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను తీసుకొస్తూనే ఉంది. మొన్నటి వరకు బడ్జెట్ ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా మిడ్ రేంజ్‌లో ఓ మంచి ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ 6టీ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 31, 2024 | 11:15 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ 6టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5K LTPO 3D కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ ఈ ఫోన్ సొంతం. దీంతో సన్‌లైట్‌లోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 120 వాట్స్‌కు సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్‌ను అందించారు. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ చెబుతోంది.

రియల్‌మీ జీటీ 6టీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో గూగుల్ జెమిని ఏఐ ఫీచర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999గా ఉంది.




