Fitbit Ace LTE: గూగుల్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్ వాచ్.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం, సెర్చ్ ఇంజన్ సంస్థ గూగూల్ స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ వాచ్‌లను కూడా లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వస్తోంది. గూగుల్ ఫిట్‌బిట్ ఏస్ లైట్ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.
Kids Watch
Follow us
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం గూగుల్ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఫిట్ ఏస్ ఎల్టీఈ పేరుతో ఈ వాచ్‌ను ప్రత్యేకంగా చిన్నారుల కోసం తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో ఎల్టీఈ కనెక్టివిటీని ఇన్‌బిల్ట్‌గా అందించారు.
Fitbit Ace Lte Featuresఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ డివైజ్‌లకు వాచ్‌ను కనెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో చిన్నారుల స్మార్ట్ వాచ్‌ను పేరెంట్స్ రియల్ టైమ్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు, చిన్నారులకు వాచ్‌లో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్‌లను పొందొచ్చు.
జూన్ 5వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలను ప్రారంభించనున్నారు. ధర విషయానికొస్తే మన కరెన్సీలో రూ. 19 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి గ్లోబల్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా కొన్ని గేమ్స్ అందించారు. చిన్నారుల యాక్టివిటీస్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా ఈ వాచ్‌లో ఫీచర్లను అందించారు. ఫిట్‌బిట్ ఏస్ యాప్‌తో ఈ వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇక చిన్నారుల లొకేషన్‌ను కేవలం పేరెంట్స్ మాత్రమే యాక్సెస్ చేసేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. అలాగే లొకేషన్ డేటా ప్రతీ 24 గంటలకు ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది. ఈ వాచ్‌ను వాటర్ రెసిస్టెంట్‌గా డిజైన్ చస్త్రశారు. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 గంటలు పనిచేస్తుందని చెబుతున్నారు.