- Telugu News Photo Gallery Technology photos Vivo launching new smart phone vivo x200 and pro features and price details
Vivo X200: వివో నుంచి మరో స్టన్నింగ్ ఫోన్.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే..
ఓవైపు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తూనే మరోవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తోంది ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో. ఇటీవల వివో ఎక్స్ 100 సిరీస్‌తో వచ్చిన వివో తాజాగా వివో ఎక్స్ 200 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 01, 2024 | 8:56 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి తాజాగా వివో ఎక్స్200 పేరుతో కొత్త సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. వివో ఎక్స్ 200, ఎక్స్200 ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్స్ లీక్ అవుతున్నాయి.

వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబతోంది. వివోఎక్స్ 100 స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో పంచ్ హోల్ డిస్‌ప్లేతో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. 1260 x 2800 పీఎక్స్, 144 హెచ్‌జెడ్ రిజల్యూజన్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్, 5జీ, వోల్ట్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 70,000గా ఉండొచ్చని అంచనా. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.




