Poco M6 Pro 5G: రూ. 10 వేలలో 5జీ ఫోన్‌.. 50 ఎంపీ కెమెరాతో పాటు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌ వర్క్‌ సేవలు విస్తరిస్తున్నాయి. మొన్నటి వరకు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన 5జీ సేవలు ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో 5జీకి సపోర్ట్ చేసే ఫోన్‌లు సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్‌ చేస్తున్నారు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో మార్కెట్లోకి బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Dec 01, 2023 | 11:01 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో తాజాగా భారత మార్కెట్లోకి పోకో ఎం6 ప్రో 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే.. బేస్‌ వేరియంట్ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 10,999కాగా 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 11,999, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999గా నిర్ణయించారు.

1 / 5
ఇక ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫారెస్ట్ గ్రీన్‌, పవర్‌ బ్లాక్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభించనుంది.

2 / 5
పోకో ఎం6 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.79 ఇంచెస్‌తో కూడిన భారీ డిస్‌ప్లేను అందించారు. పోకో ఫోన్స్‌లో ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇదే భారీ డిస్‌ప్లే కావడం విశేషం. దీని డిస్‌ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్ ఈ ఫోన్‌ సొంతం.

3 / 5
ఇక ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌తో పాటు మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
ఈ ఫోన్‌లో ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6 జీబీ వరకు పెంచుకోవవచ్చు. ఐపీ53 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా అందించారు. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌ పక్క భాగంలో అందించారు.

5 / 5
Follow us