- Telugu News Photo Gallery Technology photos Pee powered tractor human urine to be use as petrol diesel
Knowledge: పెట్రోల్, డీజిల్‌లకు సరైన ప్రత్యామ్నాయం.. యూరిన్‌తో నడిచే ట్రాక్టర్ రెడీ
Viral News: దేశంలో రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశనంటుతున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వాలు, ఇంధన కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. కేవలం భారత దేశంలోనే కాకుండా
Updated on: Jul 29, 2022 | 4:11 PM

దేశంలో రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశనంటుతున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వాలు, ఇంధన కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. కేవలం భారత దేశంలోనే కాకుండా అమెరికాలాంటి అగ్రదేశాలు ఈ దిశగా కసరత్తులు మొదలుపెట్టాయి.

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మనుషుల యూరిన్‌తో కలిసి ట్రాక్టర్‌ను సిద్ధం చేసింది. వాస్తవానికి, అమెరికన్ కంపెనీ అమోగి అమ్మోనియాతో నడిచే ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో మన మూత్రంలో అమ్మోనియా పుష్కలంగా ఉంటుంది.

వాస్తవానికి అమోగి కంపెనీ అమ్మోనియాను విచ్ఛిన్నం చేసే రియాక్టర్లను తయారుచేస్తుంది. ఇందులో భాగంగా దాని నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్‌ను ఉపయోగిస్తుంది. కాగా యూరిన్‌ను డైరెక్టుగా ఇంధనంగా వాడకుండా ఓ రసాయన చర్య ద్వారా దీనిని మండించవచ్చు.

కాగా మూత్రాన్ని అమ్మోనియాగా మార్చవచ్చని, దాని నుంచి శక్తిని ఉత్పత్తి చేయవచ్చని DW తన నివేదికలో తెలిపింది. కంపెనీ ప్రస్తుతం ట్రాక్టర్లతో ఈ ప్రయోగం చేస్తోంది. భవిష్యత్తులో దీనితో సముద్ర కార్గో షిప్‌లను నడపాలనుకుంటున్నారు.

అమ్మోనియాను కొన్ని దశాబ్దాలుగా పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. దీని నిల్వల నిర్వహణ, డెలివరీ కోసం ఇప్పటికే పలు అత్యాధునిక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. పైగా అమ్మోనియా కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయదు. అదేవిధంగా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, కార్బన్ రహిత ఉద్గారాలకు ఇది మంచి ఎంపిక.




