- Telugu News Photo Gallery Technology photos Instagram new feature will coming soon for users earning money
Instagram New Feature: సరికొత్త ఫీచర్ తీసుకురానున్న ఇన్‌స్టాగ్రమ్.. యూజర్లకు డబ్బులే డబ్బులు..!
Instagram New Feature: సరికొత్త ఫీచర్ తీసుకురానున్న ఇన్‌స్టాగ్రమ్.. యూజర్లకు డబ్బులే డబ్బులు..!
Updated on: May 03, 2021 | 1:11 PM

ఇన్‌స్టాగ్రమ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు భారీ స్థాయిలో డబ్బులు సంపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్ (ఇన్‌స్టాగ్రామ్) వినియోగదారులు తమ అకౌంట్ ద్వారా వాణిజ్య, వ్యాపారాలు నిర్వహించుకునేలా, బ్రాండెండ్ కంటెంట్ మార్కెట్‌ప్లేస్‌లతో సహా దాని ప్లాట్‌ఫాం నుండి డబ్బు సంపాదించడానికి వినియోగదారులకు సహాయపడే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరితో లైవ్ స్ట్రీమ్ సందర్భంగా రాబోయే ఫీచర్లను ప్రకటించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఇన్‌స్టాగ్రమ్ వినియోగదారులు తమ తమ ఉత్పత్తులను విక్రయించడానికి, వ్యాపారా నిర్వహించుకోవడానికి ఈ ఫీచర్ అనుకూలంగా ఉండనుంది.

చాలామంది ఖాతాదారులు తమ వ్యాపారాలను ప్రమోట్ చేయడానికి వీలుగా.. వారి వారి వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉండటం కోసం ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నామని జూకర్‌బర్గ్ తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రోడక్ట్స్‌ని అమ్మవచ్చు అని పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ బ్రాండెడ్ కంటెంట్ మార్కెట్‌లో కూడా పనిచేస్తోంది. ఇది స్పాన్సర్‌లలో ప్రభావశీలులను సరిపోల్చడానికి సహాయపడుతుంది. కాగా, కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అకాశం ఉందని తెలుస్తోంది.




