- Telugu News Photo Gallery Technology photos Soon oneplus going to launch nord n100 and nord n10 smart phones in indian market features and specifications
New OnePlus Phones: భారత మార్కెట్లోకి కొత్తగా రెండు వన్‌ప్లస్ ఫోన్లు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు..
New OnePlus Phones: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం తాజాగా భారత్‌లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేయనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్లపై స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ఆసక్తినెలకొంది...
Updated on: May 02, 2021 | 2:34 PM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరీ ముఖ్యంగా భారత మార్కెట్లో ఈ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోందీ దిగ్గజ సంస్థ.

తాజాగా వన్ ప్లస్ భారత మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురానుంది. త్వరలో ఈ ఫోన్లు విడుదల కానున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్100, వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 100 ఫీచర్ల విషయానికొస్తే.. 6.52 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10పై పనిచేస్తుంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ సొంతం.

ఇక వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ ఫోన్ ఫీచర్లు.. ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 690 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10పై నడుస్తుంది. 4300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇక ధర విషయానికొస్తే.. ఈ రెండు ఫోన్లు వన్‌ప్లస్ సిరీస్‌లో రానున్న తొలి బడ్జెట్ ఫోన్లుగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.




