- Telugu News Photo Gallery Technology photos Infinix launching new smartphone Infinix Zero Flip features and price details
Infinix Zero Flip: ఇన్‌ఫినిక్స్ మరో అద్భుతం.. బడ్జెట్‌లో ఫ్లిప్ ఫోన్..
ప్రస్తుతం మార్కెట్లో ఫ్లిప్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపు దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఫ్లిప్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 11, 2024 | 11:17 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 17వ తేదీన మార్కెట్‌లోకి లాంచ్ చేయనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3.64 ఇంచెస్‌ఓ కూడిన కవర్ స్క్రీన్‌ను అందిస్తున్నారు. అలాగే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.9 ఇంచెస్ ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు.

ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాను అందిస్తున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 32MPతో కూడిన ఫ్రంట్ కెమెరా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 70 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4270 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ధర విషయానికొస్తే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్లో 600 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. అంటే మన భారత కరెన్సీలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 50 వేల వరకు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.




