- Telugu News Photo Gallery Technology photos Amazon offering 50 percent discount on iffalcon 65 inches smart tv
Iffalcon 65 inch tv: లక్ష రూపాయాల స్మార్ట్ టీవీ రూ. 50 వేలకే.. 65 ఇంచెస్ స్క్రీన్‌తో పాటు మరెన్నో ఫీచర్లు..
Iffalcon 65 inch tv: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ Iffalcon స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్‌ను అందించింది. 65 ఇంచెస్ స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ టీవీపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది..
Updated on: May 30, 2022 | 4:46 PM

కరోనా తర్వాత ఇంట్లోనే సినిమా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో భారీ స్క్రీన్ టీవీలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెజాన్‌లో వినియోగదారులకు మంచి ఆఫర్‌ను అందించింది.

iFFALCON రూపొందించిన 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 1,06,990 కాగా అమెజాన్‌లో ఆఫర్లో భాగంగా 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 52,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం అధనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. 24 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో పవర్ స్పీకర్స్ ఈ టీవీ సొంతం.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో 2 జీబీ ర్యామ్‌ను అందించారు. యూఎస్‌బీ, హెచ్‌డీఎమ్‌ఐ కనెక్టివిటీ ఇచ్చారు.

డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్‌తో పాటు క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ మోడ్ కోసం ప్రత్యేక ఫీచర్‌ను అందించారు.




